Begin typing your search above and press return to search.
మోడీ వచ్చే వేళ.. మళ్లీ టూరు పెట్టుకున్నకేసీఆర్
By: Tupaki Desk | 25 May 2022 11:30 AM GMTతాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయటం కోసం దేనికైనా.. ఎంతటి పనికైనా సిద్ధమవుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రంతో ఆయనకు ఉన్న పంచాయితీ గురించి అందరికి తెలిసిందే. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 (గురువారం)న హైదరాబాద్ కు రావటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్న వేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ వేరే రాష్ట్రానికి పర్యటనగా వెళుతుండటం తెలిసిందే.
గడిచిన కొంతకాలంగా ప్రధాని మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంచాయితీ ఉన్న విషయం అందరికి తెలిసిందే. తనకు నచ్చిన వారిని సైతం కలిసేందుకు పెద్దగా ఇష్టపడని కేసీఆర్.. తనకు ఏ మాత్రం నచ్చని ప్రధాని మోడీని ఇప్పుడు కలిసేందుకు ఆయన సుతారం ఇష్టపడటం లేదు. నిజానికి ర మొన్న ఢిల్లీ.. పంజాబ్ రాష్ట్రాలకు వెళ్లిన ఆయన.. పనిలో పనిగా అక్కడి ముఖ్యమంత్రులతో పాటు.. అక్కడ జరిగిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సాయం చేసి రావటం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం చూసినప్పుడు ప్రధాని మోడీ తెలంగాణను విడిచి పెట్టిన తర్వాతే రాష్ట్రంలోకి అడుగు పెట్టటం ఉండేది. మరేం అయ్యిందో కానీ.. సోమవారం తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ప్రగతిభవన్ కు రావటం.. కొన్నిగంటల వ్యవధిలోనే ఆయన ఫాం హౌస్ అదేనండి ఫార్మర్ హౌస్ కు వెళ్లిపోవటం తెలిసిందే. గురువారం ఉదయం ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో ఆయన ఐఎస్ బీ ప్రాంగణానికి చేరుకుంటారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం కేసీఆర్.. ఈ రోజు (బుధవారం) సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళుతున్నారు. దీంతో.. మరోసారి ప్రధాని టూర్ కు మరోసారి ఆయన దూరంగా ఉంటున్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. రాష్ట్రానికి వస్తున్న అతిధిని పట్టించుకోని ముఖ్యమంత్రి.
తెలంగాణ రాష్ట్రానికి అది చేయాలి.. ఇది చేయాలని మాత్రం డిమాండ్ చేసే గులాబీ దండు వాదనకు తగ్గట్లు.. తన వంతు కర్తవ్యంగా రాష్ట్రానికి వచ్చే అతిధిని స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది కదా? ఎప్పుడు హక్కుల గురించి మాట్లాడే కేసీఆర్.. తమకూ బాధ్యతలు ఉంటాయన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా?
బెంగళూరులో మాజీ ప్రధాని దేవగౌడతో సమావేశం అయిన తర్వాత రాలెగావ్ సిద్దికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీని దర్శించుకోనున్నారు. అటు నుంచి అటే వీలైతే కుటుంబ సభ్యులతో కలిసి బెంగాల్.. బిహార్ రాష్ట్రాల పర్యటనకు వెళతారని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. మోడీ మాష్టారు రాష్ట్రానికి వచ్చే ప్రతి సందర్భంలో ఏదో ఒక పని పెట్టుకొని వేరే రాష్ట్రానికి వెళ్లే వైనం చూసినప్పుడు.. సీఎం కేసీఆర్ తీరుపై క్వశ్చన్ మార్కులు తలెత్తటం ఖాయం. అలాంటిదేమీ లేకుండా క్లారిటీ ఇస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా గులాబీ బాస్?