Begin typing your search above and press return to search.

మోడీ కామెంట్స్‌.. నెటిజ‌న్ల రియాక్ష‌న్‌.. త‌ల‌ప‌ట్టుకున్న బీజేపీ!

By:  Tupaki Desk   |   26 Feb 2021 12:30 AM GMT
మోడీ కామెంట్స్‌.. నెటిజ‌న్ల రియాక్ష‌న్‌.. త‌ల‌ప‌ట్టుకున్న బీజేపీ!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తాజాగా చేసిన కామెంట్లు.. దీనికి ఏపీ నెటిజ‌న్ల రియాక్ష‌న్‌.. ఇప్పుడు ఏపీ బీజేపీ నేత‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. దేశ‌వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేస్తామ‌ని. ప్ర‌భుత్వం వ్యాపారాలు చేసేందుకు లేద‌ని, కేవ‌లం ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మాత్ర‌మే ఉంద‌ని వెల్ల‌డించి.. అడ్డంగా దొరికిపోయారు. దీనిని నిశితంగా ప‌రిశీలించిన ఏపీ ప్ర‌జ‌లు.. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంటును కూడా ప్రైవేటీక రిస్తామ‌నే విష‌యాన్ని ఆయన చెప్ప‌క‌నే చెప్పేశారని పేర్కొంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ముందు ఏపీలో బీజేపీని ఎత్తేయండి. అని సీరియ‌స్ కామెంట్లు చేశారు వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర బీజేపీ నేత‌లు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారంలోకి రావాల‌నే కాంక్ష‌తో ఏపీ బీజేపీ నాయ‌కులు ప‌నిచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ర‌థ‌యాత్ర‌లు కూడా చేయాల‌ని అనుకున్నారు. అయితే.. కేంద్రం తీసుకుంటున్న చ‌ర్య‌లు, ప్ర‌క‌టిస్తున్న విష‌యాలు వంటివి నేత‌ల‌కు తీవ్ర ఇబ్బందిక‌ర‌ప‌రిణామాలుగా మారాయి. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు. లోటు బ‌డ్జెట్‌ను బ‌ర్తీ చేయ‌డం లేదు.

అమరావ‌తి విషయంపై మాకు సంబంధం లేద‌ని .. రాజ‌ధాని విష‌యం రాష్ట్రానికి చెందింద‌ని కుండ‌బ‌ద్ద ‌లు కొట్టింది. అదేస‌మ‌యంలో పోల‌వరం ప్రాజెక్టును పూర్తి చేయ‌డంలోనూ స‌హ‌క‌రించ‌డం లేదు ఈ అంశాల‌ను ప్ర‌జ‌లు ఏపీ నేత‌ల వ‌ద్ద బాగానే ప్ర‌స్తావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి స‌మాధానం చెప్పే ప‌రిస్థితిలేక ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక‌, తాజాగా విశాఖ ఉక్కును కూడా అమ్మేస్తామ‌ని ప్ర‌య‌త్నించ‌డం పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.వీరికి స‌మాధానం చెప్ప‌లేక రాష్ట్ర నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ న ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌జ‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. ఈ నేప‌థ్యంలోనే త‌మ‌కు ఏమీ ఇవ్వ‌రు.. ఉన్న‌వీ లాగేస్తారు.. ఇక‌, బీజేపీతో ప‌నేంటి? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అందుకే.. మీరేమైనా చేసుకోండి.. ముందు బీజేపీని మూసేయండి.. అని కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యాన్ని రాష్ట్ర నేత‌ల ముందు కూడా వ్య‌క్తీక‌రిస్తున్నారు. మ‌రి ఇది మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.