Begin typing your search above and press return to search.
పంజాబ్ లో మోడీ ప్రచారం.. కాంగ్రెస్, ఆప్ ల పై తీవ్ర విమర్శలు
By: Tupaki Desk | 16 Feb 2022 8:40 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్‌లో పర్యటించారు. ఇక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల పై తీవ్ర విమర్శలు చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు పంజాబ్ వీడ్కోలు పలకాలని పిలుపునిచ్చారు. పంజాబ్‌కు బీజేపీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. విపక్షాలు మాత్రం రాష్ట్రాన్ని రాజకీయ కోణంలోనే చూస్తాయని మండిపడ్డారు.
పంజాబ్ లోని పేదలతో పాటు దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆకలితో ఉండకూడదని ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పంజాబ్ లోని పఠాన్‌కోట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ... విపక్షాలపై విమర్శలు గుప్పించారు.
ఏయే రాష్ట్రాల్లో అయితే బీజేపీ నిలదొక్కుకునే స్థితికి చేరుకుంటుందో.. అక్కడ కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందని మోడీ చెప్పారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. ఒకరు పంజాబ్‌ను లూటీ చేస్తే.. మరొకరు ఢిల్లీ లో స్కాముల మీద స్కాములు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
మాకు పంజాబ్ చాలా ముఖ్యం. విపక్షాలు మాత్రం పంజాబ్‌ను రాజకీయ కోణంలోనే చూస్తుంటాయి. బుజ్జగింపు రాజకీయాలకు పంజాబ్ వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. కెప్టెన్ సాబ్(అమరీందర్ సింగ్) కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. ఆ పార్టీ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఆపేవారు.
ఇప్పుడు ఆయన కూడా అందులో నుంచి బయటకు వచ్చారు. ఆప్, కాంగ్రెస్ రెండూ ఒకటే. కాంగ్రెస్ ఒరిజినల్ అయితే.. ఆప్ దానికి ఫొటోకాపీ. వీరిద్దరూ ఒక్కటే అయినా.. పంజాబ్ లో మాత్రం ఒకరి పై ఒకరు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అని మోడీ విరుచుకుపడ్డారు.
అంతకుముందు.. గురు రవిదాస్ జయంతి సందర్భంగా డిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. విశ్రమ్ ధామ్‌లో నిర్వహించిన 'షాదాబ్ కీర్తన్'లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ వాద్య పరికరాన్ని చేతిలో పట్టుకొని.. గురు రవిదాస్‌ను కీర్తించారు. ఇదే విషయాన్ని పంజాబ్ లోనూ చెప్పుకొచ్చారు.