Begin typing your search above and press return to search.
ట్రంప్ కంపు మాటలకు మోడీ పంచ్
By: Tupaki Desk | 10 Jun 2016 2:38 PM GMTభారతీయుల భాషను యాసను కించపరిచేలా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. ట్రంప్ పేరెత్తకుండానే అతడికి రిటార్ట్ ఇచ్చారు మోడీ. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే స్పెల్ బీ పోటీల్లో భారతీయ పిల్లల ఆధిపత్యం గురించి ఉదహరించడం ద్వారా ట్రంప్ వెర్రి మాటల్ని తిప్పి కొట్టారు మోడీ. డెలావేర్ లో జరిగిన అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ 45 నిమిషాలు మాట్లాడారు. అందులో అనేక విషయాలను చెబుతూనే మధ్యలో స్పెల్ బీ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ భాష, యాసలను కించపరిచేలా మాట్లాడిన ట్రంప్ కు గట్టి సమాధానంగానే స్పెల్ బీ అంశాన్ని మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా స్పెల్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థులే విజేతలుగా అవుతున్నారు. 2016 లో నిహార్ జంగా (టెక్సాస్) - జైరాం హత్వార్ (న్యూయార్క్) టైటిల్ గెలిచారు. అంతకుముందు కూడా ఐదు సంవత్సరాలు మనోళ్లే విజేతలయ్యారు.
ఈ ఏడాది ఫైనల్ రౌండుకు వచ్చిన 285 మందిలో దాదాపు 70 మంది భారతీయ సంతతికి చెందిన వారే ఉండటం విశేషం. ఇప్పటిదాకా స్పెల్ బీ పోటీల్లో 80 శాతం మన విద్యార్థులే విజేతలుగా నిలవడం విశేషం. ఈ అంశాల్ని ప్రస్తావించడం ద్వారా భారతీయుల స్థాయి ఇదీ అని ట్రంప్ కు పరోక్షంగా రిటార్ట్ ఇచ్చారు మోడీ. భారతీయులు అమెరికాలో ఉత్తమ సీఈవోలుగా - అధ్యాపకులుగా - వ్యోమగాములుగా - శాస్త్రవేత్తలుగా - ఆర్థిక వేత్తలుగా - వైద్యులుగా ఉన్నారన్న సంగతీ మోడీ గుర్తు చేశారు.ట్రంప్ డెలావేర్ లోనే భారతీయుల భాష.. యాసను కించపరిచేలా మాట్లాడగా.. మోడీ కూడా అక్కడ జరిగిన కార్యక్రమంలోనే ఈ విషయాల్ని ప్రస్తావించడం గమనార్హం.తన క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాల కోసం ఫోన్ చేస్తే భారత్ లో నడిచే ఓ కాల్ సెంటర్ నుంచి అవతలి వ్యక్తి మాట్లాడారని చెబుతూ.. ఆ ఉద్యోగి భాషను కించపరుస్తూ మాట్లాడాడు ట్రంప్. అంతే కాక భారతీయులకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశాడతను.