Begin typing your search above and press return to search.

క‌రుణ‌కు ఆఫ‌ర్ చేసిన‌ మోడీకి భారీ డ్యామేజ్‌

By:  Tupaki Desk   |   8 Nov 2017 6:19 AM GMT
క‌రుణ‌కు ఆఫ‌ర్ చేసిన‌ మోడీకి భారీ డ్యామేజ్‌
X
మోడీ టైం బాగోలేద‌న్న‌ట్లుగా ఉంది. ఈ మ‌ధ్య‌న ఆయ‌నేం మాట్లాడినా.. కొత్త కోణం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి క‌మ‌ల‌నాథులు క‌స్సుమ‌నేలా చేస్తోంది. త‌న ఆఫీసులో ప‌ని చేసే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో జ‌రుగుతున్న పెళ్లికి హాజ‌రు కావ‌టంతో పాటు.. చెన్నైలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌టానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. నాట‌కీయంగా డీఎంకే చీఫ్ క‌రుణానిధిని క‌ల‌వటం తెలిసిందే.

రాజ‌కీయ వ‌ర్గాలు ఊహించ‌ని విధంగా క‌రుణ ఇంటికి వెళ్లిన మోడీ.. త‌న‌ను గుర్తు ప‌ట్ట‌ని క‌రుణ (అనారోగ్యం కార‌ణంగా) చేతిని ప‌ట్టుకొని ప‌దినిమిషాల‌కు పైనే ఉన్నారు. అక్క‌డితో ఆగారా.. మీరు ఢిల్లీకి వ‌చ్చి నా అధికారిక నివాసంలో ఉంటారా? అక్క‌డ రెస్ట్ తీసుకుంటారా? అంటూ ఆఫ‌ర్ ఇవ్వ‌టం ద్వారా క‌రుణ ఫ్యామిలీ మ‌న‌సుల్ని దోచేశారు. తీవ్ర అనారోగ్యంతో మాట్లాడ‌లేని స్థితిలో ఉన్న 93ఏళ్ల క‌రుణ‌ను ప‌రామ‌ర్శించ‌టానికి మోడీ వెళ్లిన‌ట్లు చెప్పినా.. అంత సీన్ లేద‌ని.. అదంతా రాజ‌కీయ కోణంలో జ‌రిగిన మీటింగ్‌గా చెబుతున్నారు.

క‌రుణ‌ను త‌న ఇంటికి వ‌చ్చి రెస్ట్ తీసుకోవాల‌న్న మోడీ మాట‌ల్లోని శ్లేష ఇప్పుడిప్పుడు అంద‌రికి అర్థ‌మ‌వుతోంది. మోడీ వ‌చ్చి క‌రుణ‌ను ప‌రామ‌ర్శించారో లేదో.. ఈ రోజు దేశ వ్యాప్తంగా పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా నిర్వ‌హించే నిర‌స‌న‌ను డీఎంకే కుదించుకోవ‌టం గ‌మ‌నార్హం. ఇదొక్క‌టి చాలు.. రానున్న రోజుల్లో త‌మిళ‌నాడులో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించాల‌న్న విష‌యాన్ని అర్థం చేసుకోవ‌చ్చు.

ఢిల్లీకి వ‌చ్చి నా ఇంట్లో రెస్ట్ తీసుకోమ‌ని మోడీ అడ‌గ‌టం ద్వారా త‌న భ‌విష్య‌త్ రాజ‌కీయ అవ‌స‌రాల్ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పేశారు. అల్జీమ‌ర్స్ తో బాధ‌ప‌డుతూ.. గ‌త ఏడాదే ట్రెకోట‌మీ చికిత్స తీసుకున్న క‌రుణ‌.. అప్ప‌టినుంచి మాట్లాడ‌టం లేదు.

రాజకీయ వ్య‌వ‌హారాల్ని కరుణ కుమారుడు స్టాలిన్ న‌డుపుతున్నారు. క‌రుణ‌ను కేవ‌లం ప‌రామ‌ర్శించ‌టానికి వెళ్లిన‌ట్లు బీజేపీ నేత‌లు చెబుతున్నా.. అస‌లు విష‌యం అర్థం కానంత అమాయ‌కంగా దేశ ప్ర‌జ‌లు లేరు. రానున్న రోజుల్లో డీఎంకే త‌మిళ‌నాడులో బ‌ల‌ప‌డ‌టం ఖాయం. అదే జ‌రిగితే.. డీఎంకే బ‌లం యూపీఏకు చోద‌క‌శ‌క్తిగా మార‌కూడ‌ద‌న్న‌ది మోడీ ప్లాన్‌.

2019 ఎన్నిక‌ల త‌ర్వాత డీఎంకేకు ద‌క్కే సీట్ల‌ను.. త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌టానికి వీలుగా పావులు క‌దిపే య‌త్నంలో తాజాగా చోటు చేసుకున్న‌ది మొద‌టి అడుగ్గా చెప్పాలి. ఇంటికి రావాలంటూ క‌రుణ‌ను మోడీ అడ‌గ‌టం రాజ‌కీయంగా ఈక్వేష‌న్లను ప‌క్క‌న పెడితే.. వ్య‌క్తిగ‌తంగా మోడీకి భారీ డ్యామేజ్ జ‌రిగింద‌న్న మాట వినిపిస్తోంది.

మోడీ మాట‌కు సోష‌ల్ మీడియాలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. వ‌య‌సు మీద ప‌డ్డ త‌ల్లిని ఢిల్లీలోని త‌న ఇంట్లో ఉంచుకొని మ‌హారాణిలా చూసుకోవాల్సిన మోడీ.. ఆ ప‌ని చేయ‌రు కానీ.. రాజ‌కీయంగా మేలు జ‌రుగుతుంద‌న్న ఆశ‌తో క‌రుణ‌ను ఉంచుకోవ‌టం ఏమిటి? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. క‌న్న‌త‌ల్లిని చూసుకోని మోడీ.. క‌రుణ‌ను ఎలా చూసుకోగ‌ల‌ర‌న్న ప్ర‌శ్న ప‌లువురు నోట్లో నుంచి వ‌స్తోంది. ఇప్ప‌టికే పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ నిర్ణ‌యాల‌పై దేశ ప్ర‌జ‌ల్లో మోడీ వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌గా.. తాజాగా క‌రుణ‌తో అన్న మాట‌.. ఆయ‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అయినా.. ఇంట్లో వాళ్ల‌ను ప‌ట్టించుకోకుండా ఊళ్లో వాళ్ల‌ను ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవ‌టం ఏంటి మోడీ?