Begin typing your search above and press return to search.

అతివాద గోరక్షకులకు మోడీ వార్నింగ్

By:  Tupaki Desk   |   29 Jun 2017 11:13 AM GMT
అతివాద గోరక్షకులకు మోడీ వార్నింగ్
X
గోరక్షణ ముసుగులో దేశంలో జరుగుతున్న దారుణాలు, దాడులపై ప్రధాని మోడీ తొలిసారి సీరియస్ గా స్పందించారు. గోరక్షకులమని చెప్పుకుంటూ హత్యలు చేస్తూ తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. భక్తి పేరిట హత్యలు చేస్తుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుంది. . మనది అహింసా దేశం. గాంధీ నడయాడిన దేశం.. ఆ సంగతి మరచిపోతే ఎలా? అంటూ ఆయన అన్నారు.

మూడు దేశాల పర్యటనను ముగించుకుని నిన్న ఢిల్లీ చేరుకున్న ఆయన, ఈ రోజు తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు వచ్చి అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమాన్ని ప్రారంభించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా, శత వార్షిక ఉత్సవాలను ప్రారంభించిన ఆయన ఆ తరువాత ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మన దేశంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే శక్తి ఎవరికీ లేదని అన్నారు. హింసతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ నూలు ఒడికిన రాట్నం ముందు మోదీ కాసేపు కూర్చుని దూది నుంచి దారాన్ని తీశారు.

కాగా కొన్నాళ్లుగా దేశంలో గోరక్షకుల పేరుతో కొందరు చూపిస్తున్న దూకుడు, చేస్తున్న అరాచకాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇది బీజేపీకి కూడా చెడ్డపేరు తెస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ దీనిపై స్పష్టమైన హెచ్చరికలు చేయడంతో కొంతవరకు దారుణాలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/