Begin typing your search above and press return to search.

300 దాటితే.. మోడీ ఖాతాలో మ‌రో ఘ‌న‌త‌!

By:  Tupaki Desk   |   22 May 2019 5:31 AM GMT
300 దాటితే.. మోడీ ఖాతాలో మ‌రో ఘ‌న‌త‌!
X
ఎగ్జిట్ పోల్స్ విడుద‌లై రెండు రోజులు పూర్తి అయితే.. అస‌లుసిస‌లు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌టానికి మ‌రో రోజు మాత్ర‌మే మిగిలింది. గురువారం ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌ల‌య్యే ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌.. ప్రాధ‌మికంగా బ‌లాబ‌లాలు.. గెలుపోట‌ముల మీద లెక్క ఒక కొలిక్కి రావ‌టానికి ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కూ ప‌డుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అధికారిక ఫ‌లితాల వెల్ల‌డి రాత్రి ప‌ది గంట‌ల‌కు కానీ మొద‌లు కాద‌ని చెబుతున్నారు. అయితే.. మ‌ధ్యాహ్నానానికి ఫ‌లితాల మీద ఒక క్లారిటీ వ‌చ్చేస్తుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే వెలువ‌డిన 11 ఎగ్జిట్ పోల్స్ అన్ని కేంద్రంలో మోడీ స‌ర్కార్ ఖాయ‌మ‌ని.. ఆయ‌న 290 నుంచి 380 సీట్ల వ‌ర‌కూ సొంతం చేసుకోనున్న‌ట్లుగా త‌మ అంచ‌నాలు వెల్ల‌డించాయి. ఒక్క‌టంటే ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా మోడీ ప‌రివారం ఓట‌మిని ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం ఒక ఎత్తుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. కేంద్రంలో మోడీ స‌ర్కార్ మ‌రోసారి కొలువు తీరితే.. ఆ క్రెడిట్ మొత్తం మోడీకే చెందుతుంద‌ని చెప్పాలి. ఒంటి చేత్తో పార్టీని గెలిపించిన నేత‌గా నిలిచిపోతారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌రో రికార్డు మోడీ ప‌రం కానుంది. ఇందిరా గాంధీ త‌ర్వాత‌.. వ‌రుస‌గా రెండుసార్లు త‌న వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాతో పార్టీని గెలిపించి.. కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త న‌మో ఖాతాలో జ‌మ అవుతుందంటున్నారు. ప్ర‌తిప‌క్షాల ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ.. ఢీ అంటే ఢీ అన్న‌ట్లు సాగిన మోడీ ప్ర‌చారం ముందు విప‌క్షాలు నిల‌బ‌డ‌లేక‌పోయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. విజేత‌గా నిలిచే మోడీ ప‌రిస్థితి తిరుగులేన‌ట్లుగా మారితే.. ప‌రాజితుడిగా పేర్కొనే రాహుల్ ప‌రిస్థితే ఇబ్బందిక‌రంగా మారుతుందంటున్నారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. మోడీ బ్యాచ్ కానీ ట్రిఫుల్ సెంచురీ దాటితే.. ఆ రికార్డు నేరుగా మోడీ ఖాతాలోకి వ‌చ్చి చేరుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.