Begin typing your search above and press return to search.

జెండా ఎగ‌రాల్సింది.. గుండెల్లోనా.. మేడ‌ల‌పైనా?

By:  Tupaki Desk   |   31 July 2022 12:30 AM GMT
జెండా ఎగ‌రాల్సింది.. గుండెల్లోనా.. మేడ‌ల‌పైనా?
X
``హ‌ర్ ఘ‌ర్ తిరంగా..`` ఈ పేరు వినేందుకు చాలా బాగుంది. దీనిని ఒకింత తెలుగీక‌రిస్తే.. ప్ర‌తి ఇంటిపైనా.. జాతీయ జెండా! అనే అర్ధం స్ఫురిస్తుంది. మంచిదే.. జాతీయ జెండా ఎగ‌రాల్సిందే! కానీ, ఎక్క‌డ‌..? ప్ర‌జ‌ల హృద‌యాల్లోనా.. లేక‌.. ఇంటిపై క‌ప్పుల‌పైనా? ఇదీ.. ఇప్పుడు జాతీయ వాదులు అడుగుతున్న ప్ర‌శ్న‌.

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ఆగ‌స్టు 15 నాటికి దేశంలోని ప్ర‌తి ఇంటిపైనాత్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేయాల‌ని ప్ర‌ధాని మోడీ సంక‌ల్పించారు.

అంతేకాదు.. అస‌లు జాతీయ జెండా అంటే.. ఏమిటో కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని.. పార్టీ వందిమాగ‌ధు ల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశారు. దీంతో ఇప్పుడు.. ప్ర‌తి ఇంటిపైనా జెండా ఎగుర‌వేసేలా.. ప్ర‌తి ఒక్క‌రూ జాతీయ ప‌తాకం గురించి తెలుసుకునేలా(ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌న‌ట్టు!!) క‌మ‌ల నాథులు క‌ర‌తాల ధ్వ‌నుల‌తో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించేశారు. ఇక‌, జాతీయ జెండా గురించి.. ఆగ‌స్టు 15 త‌ర్వాత‌.. దేశంలో ఏ ఒక్కరికీ తెలియ‌ని సంగ‌తులు ఉండ‌వ‌న్న మాట‌.

ఒకే.. ఇది అంద‌రూ హ‌ర్షించేదే. అయితే.. అస‌లు జెండా ఎగ‌రేయాల్సింది.. ఎక్క‌డ‌..? విశాల భార‌తావని లో ప్ర‌తి ఇంటి పైక‌ప్పుపైనేనా.. ఇదేనా జాతీయ జెండా ప‌ర‌మార్థం? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎం దుకంటే.. దేశానికి రాజ్యాంగం రాసిచ్చిన త్యాగ‌ధ‌నులు కానీ.. జాతీయ ప‌త‌కాన్ని రూపుదుద్దిన నిస్వార్థ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోదులు కానీ.. ఆశించింది.. ఇంటిపై జెండా ఎగ‌రాలనా? లేక‌.. ప్ర‌తి భార‌తీయుడి గుండెల్లోనూ.. జాతీయ స్ఫూర్తి ర‌గ‌లాల‌నా? ఏం ఆశించారు? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

భార‌త రాజ్యాంగ పీఠిక‌లోనే చెప్పిన‌ట్టు.. ``స‌ర్వ‌స‌త్తాక‌, సామ్య‌వాద‌, లౌకిక‌, ప్ర‌జాస్వామ్య‌, గ‌ణ‌తంత్ర రాజ్యం`` ప‌రిఢ‌విల్లాల‌ని.. పెద్ద‌లు ఆశించారు. కానీ, నేటి పెద్ద‌లు.. సామ్య‌వాద‌, లౌకిక‌, ప్ర‌జాస్వామ్యాల‌ను హ‌రించేసే.. విన్యాసం చేసిన‌ప్పుడు.. స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వం.. స‌ర్వజ‌న స‌హోద‌ర‌త్వం భాసిల్ల‌న‌ప్పుడు.. మ‌తాల మ‌ధ్య‌, కులాల మ‌ధ్య చిచ్చ‌లతో.. భార‌త దేశం రావ‌ణ‌కాష్టాన్ని త‌ల‌పిస్తున్న‌ప్పుడు.. జెండా ఎక్క‌డ ఎగిరినా.. ప్ర‌యోజ‌నం ఏంట‌న్న‌ది.. విజ్ఞుల మాట‌. మ‌రి.. ఈ ప‌రిణామాల‌ను స‌మ‌తుల్యం చేయ‌నంత కాలం.. ఎన్ని జెండాలు.. ఎగిరినా.. మ‌తాల మ‌ధ్య హిజాబ్ చిచ్చులు.. కులాల మ‌ధ్య ర‌గ‌డ‌లు.. ఆగిపోతాయా? అన్న‌తి తేలాల్సి ఉంది.