Begin typing your search above and press return to search.

2022 జమిలి ఎన్నికలు ఖాయం.. నో డౌట్.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   19 Nov 2020 11:10 AM GMT
2022 జమిలి ఎన్నికలు ఖాయం.. నో డౌట్.. ఎందుకంటే?
X
మోడీ ప్లానేశాడు..ఇక అమలు చేయడమే తరువాయి అంట.. బీహార్ లో ఓడిపోతుందనుకున్న పార్టీ గెలవడం.. బెంగాల్ లో బీజేపీ వేవ్ వస్తుండడంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ‘జమిలి’ పోరుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట.. దీనికి వేగంగా ప్లాన్లు చేస్తున్నారని భోగట్టా..

దేశంలో ఒకే ఒక పార్టీ ఉండాలనేది బీజేపీ సిద్ధాంతం. ప్రత్యేకించి అది బీజేపీ కావాలన్నది కమలనాథుల ఊవాచ. మోడీ ఇప్పటికే ఇలా చేయాలని ఫిక్స్ అయ్యాడంట.. బీహార్ లో మోడీ వేవ్ నడిచింది.. సర్వేలు ఎన్డీఏకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ లాస్ట్ లో విజేతగా బీజేపీనే నిలిచింది. ఆ వేవ్ ను దేశమంతా కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడట..

పశ్చిమ బెంగాల్ లో కనుక బీజేపీ గెలిస్తే ఇక మోడీని ఆపే వారు ఈ దేశంలో ఉండరు అని.. అందుకే 2022 మార్చి కల్లా జమిలి ఎన్నికలకి వెళ్లి ఫుల్ మెజార్టీ తెచ్చుకొని ఇండియా మొత్తం ఒకే పార్టీని ఉండేలా చేయాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందట..

ఇక దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. ప్రతి బూత్ లో బీజేపీకి గణనీయంగా ఓట్లు రాబట్టుకోవాలని.. ఈరోజు పరిస్థితి ప్రతి గ్రామంలో మోడీ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి బూత్ లెవల్ లో బీజేపీని బలోపేతం చేస్తే ప్రతి నియోజకవర్గంలో బీజేపీని గెలిచేలా చేయవచ్చని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోందట..

అందుకే 2022 మార్చి-ఏప్రిల్ లో జమిలి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిపితే బీజేపీదే విజయం అని.. ఆ గాలిలో ప్రాంతీయ పార్టీలు కొట్టుకొని పోయి మొత్తం బీజేపీ హవా నడుస్తుందని ప్లాన్ చేస్తున్నారట.. మరి ఈ ప్లాన్లు వర్కవుట్ అవుతాయా? కావా అన్నది వేచిచూడాలి.