Begin typing your search above and press return to search.
అమెరికాకూ ఆదర్శంగా మారిన సిక్కిం
By: Tupaki Desk | 20 Jan 2016 7:30 PM GMTచాలా చిన్న రాష్ట్రమది... పువ్వులకు ప్రసిద్ధి. అయితే.... భారత దేశంలోని ఏ రాష్ట్రం కూడా సాధించని ఖ్యాతి సాధించింది సిక్కిం. ఇప్పుడా రాష్ట్రం సేంద్రియ రాష్ట్రంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించింది.
కేవలం ఆరు లక్షల జనాభా ఉన్న సిక్కిం రాష్ట్రం డిసెంబరులోనే పూర్తిగా సేంద్రియ రాష్ట్రంగా అవతరించింది. తాజాగా ప్రధాని మోడీ అక్కడ పర్యటించిన సందర్భంలో దేశం మొత్తానికి ఈ విషయం చాటిచెప్పారు. సేంద్రియ వ్యవసాయం... పర్యావరణ పర్యాటకంలో సిక్కిం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
జాతీయ సేంద్రియ ఉత్పత్తుల మిషన్ లో భాగంగా సిక్కిం గత కొన్నేళ్లలో 75 వేల హెక్టార్లను సేంద్రియ క్షేత్రాలుగా మార్చుకున్నారు. కొద్దికాలం కిందటి వరకు అక్కడక్కడా రసాయన ఎరువుల వినియోగం ఉన్నప్పటికీ ఆ తరువాత రసాయన ఎరువులపై పూర్తిస్థాయిలో నిషేధం విధించడంతో పూర్తిగా సేంద్రియ రాష్ట్రంగా మారింది.
సేంద్రియ ఉత్పత్తుల విషయంలో సిక్కిం చాలాముందుంది. దేశం మొత్తంగా 1.24లక్షల మిలియన్ టన్నుల సేంద్రియ ఉత్పత్తులు వస్తుండగా అందులో 80 వేల మిలియన్ టన్నుల సేంద్రియ ఉత్పత్తులు సిక్కిం నుంచే వస్తున్నాయి. సేంద్రియ రంగంలో సిక్కిం సాధించిన ప్రగతిని చూసిన కేరళ - అరుణాచల్ ప్రదేశ్ - అస్సాం వంటి రాష్ట్రాలే కాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా - విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు కూడా సిక్కిం సహకారంతో తమ రాష్ట్రాలను సేంద్రియంగా మార్చుకోవడానికి కృషి చేస్తున్నాయి.