Begin typing your search above and press return to search.

కాళ్లరిగేలా తిరిగినా మోడీ ముందు నిలవలేకపోయారు

By:  Tupaki Desk   |   11 March 2017 1:12 PM GMT
కాళ్లరిగేలా తిరిగినా మోడీ ముందు నిలవలేకపోయారు
X
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ తిరుగులేని విజయంతో లోక్ సభ ఎన్నికల నాటి ఫలితాలను రిపీట్ చేయడంలో క్రెడిట్ అంతా ప్రధాని మోడీకే దక్కుతోంది. మోడీ ఛరిష్మా... మోడీపై ఉన్న ప్రజల్లో పాదుకొన్న విశ్వాసం వంటివన్నీ ఓట్ల వర్షం కురిపించాయి. యూపీలో గెలుపు కోసం మోడీ స్వయంగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు.. అయితే.. ఇతర పార్టీల అగ్రనేతలతో కంపేర్ చేస్తే మోడీ ర్యాలీలు - రోడ్ షోలలో పాల్గొన్నది తక్కువే. మోడీతో సమానమైన ఇమేజి కోసం పాకులాడే రాహుల్ గాంధీ.. సమాజ్ వాది నేత - సీఎం అఖిలేశ్ యాదవ్.. బీఎస్పీ అగ్రనేత మాయావతి వంటివారంతా యూపీలో కాళ్లరిగేలా తిరిగారు. అయినా.. మోడీ మాత్రం వారి కంటే చాలా తక్కువ రోడ్ షోలు - బహిరంగ సభలతో యూపీ ప్రజల హృదయాలను కొల్లగొట్టి సీట్లనూ కొల్లగొట్టారు.

మోడీ:

మొత్తం 23 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఒక రోడ్ షో - 2 జనతా దర్శన్ సభలు నిర్వహించారు. మొత్తంగా చూసుకుంటే 26 సభలు నిర్వహించారు.

మొత్తం 23 ర్యాలీల్లో ఏడో దశ పోలింగ్ జరిగే స్థానాల్లో 5 నిర్వహించారు. మిగతా ఆరు దశలు జరిగే ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో మూడేసి మాత్రమే నిర్వహించారు.

నిజానికి ముందు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం మోడీతో 10 నుంచి 12 ర్యాలీలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. కానీ.. మోడీ ఉత్సాహంగా 23 ర్యాలీల్లో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ: కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ .. మొత్తం 40 ర్యాలీల్లో పాల్గొన్నారు. అఖిలేశ్ యాదవ్ తో కలిసి మూడు సభల్లో పాల్గొన్నారు. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీలోనూ తిరిగినా ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ గెలవలేదు.

అఖిలేశ్ యాదవ్: సీఎం - సమాజ్ వాది పార్టీ నేత అయిన అఖిలేశ్ మొత్తం ఏడు దశల్లో 211 ర్యాలీల్లో పాల్గొన్నారు.

డింపుల్ యాదవ్: అఖిలేశ్ భార్య - ఎంపీ డింపుల్ యాదవ్ కూడా 40 ర్యాలీల్లో పాల్గొన్నారు.

మాయావతి: బీఎస్పీ అధినేత్రి మాయావతి మొత్తం 32 రోజుల్లో 53 సభల్లో పాల్గొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/