Begin typing your search above and press return to search.

వ్యాపారం లేదని ఉద్యోగులను తొలగించవద్దు : మోడీ

By:  Tupaki Desk   |   24 March 2020 11:10 AM GMT
వ్యాపారం లేదని ఉద్యోగులను తొలగించవద్దు : మోడీ
X
కరోనా వైరస్ ను ఎదుర్కోవడం తో పాటు ఉద్యోగుల భద్రత, జాబ్ సెక్యూరిటీ పైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి సారించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పారిశ్రామికవేత్తలతో సమావేశమై .. నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, ఉద్యోగుల భద్రత అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఈ కరోనా కారణంగా పర్యాటక రంగం, నిర్మాణ రంగం, సేవల రంగంతో పాటు అసంఘటిత రంగం సహా చిన్న తరహా వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రధాని మోడీ చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారిని పారదోలేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్థికంగా సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా పరిశ్రమలు తమ ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేసేందుకు అనుమతించాలని మోడీ పరిశ్రమల యజమాన్యాలని కోరారు. వ్యాపారం పెద్దగా లేదు అని ఉద్యోగులను తొలగించవద్దని, సామాజిక దూరం అనేది కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు బలమైన ఆయుధం అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్నారు.

కరోనాతో వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం కారణంగా ఉద్యోగులను మాత్రం తొలగించవద్దన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర వస్తువుల కొరత లేకుండా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. ఉత్పత్తుల వల్ల బజారుకు పోకుండా అడ్డుకోవాలని, ముడి వనరులు ధరలు పెరుగుతాయ నే ఉద్దేశ్యంతో ఒకసారి కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకోవద్దన్నారు. ఫార్మా రంగ ప్రతినిధులతో కూడా ప్రధాని మాట్లాడారు. కరోనా పరీక్షల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎన్ఏ టెస్టింగ్ కిట్స్ తయారు చేయాలన్నారు.