Begin typing your search above and press return to search.
పార్లమెంటులో మేజిక్ చేసిన మోడీ
By: Tupaki Desk | 24 July 2015 4:22 AM GMTదేశంలో ఎంతమంది నేతలు ఉన్నా.. ప్రధాని మోడీ తీరు భిన్నం. ఆయన ఎప్పుడేం చేస్తారో ఊహాకు కూడా అందదు. తనను వ్యతిరేకించే స్వపక్షంలోని వారి పీచమణిచే మోడీ.. తన విషయంలో గతంలో వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి మరీ.. సంగతి చూసే ఆయన.. తనను నిత్యం విమర్శించి.. తన విధానాల్ని తప్పు పట్టే విపక్షాల విషయంలో మరెంతో కఠినంగా ఉంటారని భావిస్తారు. కానీ.. గురువారం పార్లమెంటులో మోడీ వ్యవహరించిన తీరు.. ఒకింత విస్మయాన్ని కలుగజేసిన పరిస్థితి.
చేయాల్సిన పనుల్ని పూర్తి చేయాల్సిన విధంగా చేసే మోడీ.. బయటకు మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అధికారపక్షం.. విపక్షం అన్న తేడా లేకుండా.. ప్రధానే స్వయంగా వారి వద్దకు వెళ్లి కరచాలనం చేయటం ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రమైన ఉదంతం గురువారం పార్లమెంటులో చోటు చేసుకుంది. క్వశ్చన్ అవర్ లో సభలోకి అడుగు పెట్టిన ప్రధాని మోడీ..విపక్షాల ఆందోళనలతో వాయిదా పడిన అనంతరం ప్రతిపక్ష నేతల వద్దకు వెళ్లారు. వారిని పేరు పేరునా పలుకరించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదలు రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ అజాద్.. వడోదరలో తనపై పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైన మధుసూదన్ మిస్త్రీలతో పాటు.. విపక్ష ఉప నేత ఆనంద్ శర్మ.. కరణ్ సింగ్.. జైరాం రమేషల్ లను పలుకరించి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలతో పాటు.. సీపీఐ నేత డి. రాజా తదితరులను పలుకరించారు. పనిలో పనిగా బీజేపీ నేతలతోనూ మాట్లాడారు. ఇలా.. తనదైన శైలిలో విపక్షాలను పలుకరించి ప్రధాని మోడీ తన చేష్టలతో వారిలో ఆశ్చర్యాన్ని నింపారు.