Begin typing your search above and press return to search.

బ్రిటన్ లోనూ మోడీ ప్రచారం

By:  Tupaki Desk   |   13 Oct 2015 10:17 AM GMT
బ్రిటన్ లోనూ మోడీ ప్రచారం
X
ఇంగ్లాండులోని భారత సంతతివారు ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భాన్ని పురస్కరించుకుని వినూత్నరీతిలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ వచ్చే నెలలో ఇంగ్లాండులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయులు 'మోడీ ఎక్స్‌ప్రెస్‌' పేరిట ఒక బస్సును అలంకరించి ప్రధాన ప్రాంతాల్లో తిప్పుతున్నారు. భారత్‌ లో చాయ్‌ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నామని, ఇంగ్లాండులో బస్‌ పే చర్చా కార్యక్రమంలో పాల్గొంటామని 'యుకె వెల్కమ్స్‌ మోడీ' బృందం సభ్యులు చెబుతున్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే 400 ప్రాంతీయ సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను విజయవంతం చెయ్యడానికి అక్కడి ప్రవాస భారతీయులు (ఎన్ ఆర్ ఐలు) సిద్దమయ్యారు. నెల రోజుల పాటు బ్రిటన్ లోని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో మోడీ ఎక్స్ ప్రెస్ పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. ఆదివారం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.

బ్రిటన్‌లో లిటిల్ ఇండియాగా ప్రఖ్యాంతి గాంచిన వెంబ్లే కు ఈ బస్సు తొలుత చేరుకుంటుంది. తరువాత బ్రిటన్ లో ప్రసిద్ధి చెందిన నగరాలలో తిరుగుతుంది. దీపావళి పండగ నాటికి టాఫల్ గర్ స్క్వేర్ కు ఈ బస్సు చేరుకుంటుందని వివరించారు. వచ్చే నెల ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారి బ్రిటన్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బస్సు పే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ప్రవాస భారతీయులు చెప్పారు. నవంబర్ 13వ తేదిన వెంబ్లే స్టేడియంలో మోడీకి ఒలింపిక్స్ తరహాలో స్వాగతం చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.