Begin typing your search above and press return to search.
గ్రహణాన్ని చూడలేకపోయా...నిరాశలో మోడీ !
By: Tupaki Desk | 26 Dec 2019 9:46 AM GMTఈరోజు సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించింది. దీనితో ఈ సంపూర సూర్య గ్రహణాన్ని చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపారు. ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రయత్నించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ప్రధాని మోడీకి సూర్యగ్రహణం కనిపించలేదట. దీనికి కారణం అక్కడ ఉన్న మబ్బులే. ఈ విషయంపై ప్రధాని మోడీ ఆసక్తికర ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు.
ప్రస్తుతం కేరళలోని కోజికోడ్ లో ప్రధాని ఉన్న ప్రధాని సూర్యగ్రహం గురించి మాట్లాడుతూ.. ఎంతో మంది భారతీయుల మాదిరే తాను కూడా ఉత్సాహంగా గ్రహణాన్ని వీక్షించానని చెప్పారు. కానీ మేఘాలు అడ్డు వచ్చాయని..దీంతో తాను సూర్య గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయానని తెలిపారు. కేరళలోని కోజికోడ్ లో లైవ్ స్ట్రీమ్ పై ఆయన గ్రహణ వీక్షణ తాలూకు ఫోటోలను పోస్ట్ చేశారు. దట్టమైన మేఘాలు కమ్మి ఉన్నందున దురదృష్టవశాత్తూ కోజికోడ్ లోను, మరికొన్ని చోట్ల ఇది కనబడలేదని ఆయన తెలిపారు. అయితే ఈ గ్రహణానికి సంబంధించి వివరాలను తను నిపుణులను అడిగి తెలుసుకుంటానని మోదీ అన్నారు.
గురువారం ఉదయం 8 గంటల 17 నిముషాల నుంచి 10 గంటల 57 నిముషాల వరకు సూర్య గ్రహణం కొనసాగింది. కర్నాటక - కేరళ - తమిళనాడువాసులు పూర్తి గాను - దేశంలోని ఇతర ప్రాంతాలవారు పాక్షికంగాను గ్రహణాన్ని చూడగలిగారు. ఇండియాతో బాటు సౌదీ అరేబియా - ఖతర్ - యుఎఈ - శ్రీలంక - ఒమన్ - మలేసియా - ఇండోనీసియా - సింగపూర్ దేశాల్లో ఈ గ్రహణం పూర్తిగా సంభవించింది.