Begin typing your search above and press return to search.
మోడీ పూర్తి చేశాడు.. కేసీఆర్ మొదలెట్టాడు!
By: Tupaki Desk | 8 July 2021 6:34 AM GMTరధాని నరేంద్రమోడీ ప్రక్షాళన పూర్తయ్యింది. పనిచేయని వారిని సాగనంపి.. పనిచేసే వారికి అందలం ఎక్కించాడు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మొదలుపెట్టాడు. సీఎం కేసీఆర్ సైతం కేబినెట్ ప్రక్షాళనకు నడుం బిగించాని తెలుస్తోంది. పాలనను పట్టాలెక్కించాలని.. పనిచేయని వారిని తొలగించి యువకులు, ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.
తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది. అందులో ఒక సంవత్సరం కరోనా కల్లోలంలోనే పోయింది. చేయడానికి ఏమీ లేకుండా చేసింది. ఇంకో ఏడాది మంత్రివర్గ విస్తరణ చేయకుండా కేసీఆర్ నాన్చి వేస్ట్ చేశాడన్న ఆవేదన నేతల్లో ఉంది.. చేస్తే గీస్తే ఈ మూడేళ్లలోనే ఏమైనా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కేబినెట్లో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్ ను తొలగించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు కేసీఆర్ పాలన రెండున్నరేళ్లు అవుతున్న సందర్భంగా కేసీఆర్ సైతం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నాడు. ఎందుకంటే ఓ వైపు బీజేపీ.. మరో వైపు రేవంత్ వచ్చాక కాంగ్రెస్ బలోపేతమైంది. అందుకే కేసీఆర్ కూడా అలెర్ట్ అయ్యారు. జనంలోకి వస్తున్నారు. గత అసెంబ్లీని 9 నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారో ఇప్పుడు కూడా అదే చేస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈసారి ఎన్నిక కేబినెట్ కు గట్టిగా రెండేళ్ల టైం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే కేసీఆర్ తన కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని.. ప్రజల్లో ఆదరణ దక్కాలంటే యువత, ఉత్సాహవంతులకు అవకాశం ఇవ్వాలని పనిచేయని.. వివాదాస్పద మంత్రులను తొలగించాలని యోచిస్తున్నాడు.
ఈ ఆగస్టులో శ్రావణ మాసం కావడంతో మంచి ముహూర్తాలు ఉంటాయని.. కేసీఆర్ అప్పుడే మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈటల రాజేందర్ స్థానంలో ఎలాగూ కొత్త మంత్రిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ స్థానాన్ని భర్తీ చేయడంతోపాటు పనితీరు సరిగా లేని వారిని తొలగించి మరో ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవాలని కేసీఆర్ స్కెచ్ గీసినట్టుగా చెబుతున్నారు.
ఇక ఉత్తర తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమికి కారణమయ్యాడనే ఆరోపణలు వచ్చిన మంత్రిని కేసీఆర్ తొలగించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
మరి కేసీఆర్ ఎవరిని ఉంచుతారో..? ఎవరిని తీసేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. మంత్రి వర్గ పునర్వ్యస్తీకరణపై టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది.