Begin typing your search above and press return to search.
మీ నిజ స్వరూపం బయటపెడతానంటూ విపక్షంపై మోడీ ఫైర్
By: Tupaki Desk | 27 Dec 2020 9:15 AM GMTవ్యక్తిత్వ వికాస నిపుణుడి తరహాలో మాటలే కాదు.. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ తన రూపును మార్చేసుకుంటున్న వైనం తెలిసిందే. చక్కగా ట్రిమ్ చేసినట్లు ఉండే గడ్డం.. ఖరీదైన దుస్తుల్ని ధరించే ఆయన.. ఇటీవల కాలంలో తన రూపంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టటం తెలిసిందే. బారు గడ్డంతో.. చూసినంతనే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకు వచ్చేలా ఉంటున్నారు. ఉన్నట్లుండి.. అంతలా గడ్డం పెంచాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు ఆయనా పని చేస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సూటి సమాధానాల్ని బీజేపీ నేతలు ఎవరూ చెప్పటం లేదు. అయితే.. మోడీ గడ్డం వెనుకున్న అసలు కథ వేరని.. మరో నాలుగైదు నెలల్లో వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం గడిచిన కొన్ని నెలలుగా ఆయన తన గడ్డాన్ని పెంచుకుంటున్నట్లుగా చెబుతారు.
బెంగాల్ లో కమలవికాసంపై భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్న మోడీషాలు.. ఆ రాష్ట్ర ప్రజల మనసుల్ని దోచుకునేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ తరచూ చిరాకు పడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల వేళలోనే రాజకీయాలు.. మిగిలిన రోజులంతా ప్రజాక్షేమం కోసమేనని చెప్పే ఆయన మాటలు ఇటీవల కాలంలో ప్రభావాన్ని చూపించటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో జరుగుతున్న రైతు ఉద్యమం.. నాలుగు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికి పరిష్కారం రాలేదు.
ఇంతకూ కాంగ్రెస్ తీరును బట్ట బయలు చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రధాని.. ఏం చెప్పారన్నది చూస్తే.. కాంగ్రెస్ పార్టీ తాను చెప్పే మాటలకు.. చేతలకు సంబంధం ఉందన్న విషయాన్ని ఉదాహరణతో సహా వెల్లడించారు. ‘ఢిల్లీలో కూర్చున్న కొందరు వ్యక్తులు నన్ను నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు. అభ్యంతరకర పదజాలాన్ని వాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి రోజూ పాఠాలు చెతున్నారు. వారి నిజస్వరూపం ఈ రోజు బయటపెడతా. ప్రజాస్వామ్యం గురించి బోధిస్తున్ పార్టీ పుదుచ్చేరిలో అధికారంలో ఉంది. ఆపార్టీ అక్కడ స్థానిక ఎన్నికల్ని నిర్వహించటం లేదు. అక్కడ చివరగా 2006లో స్థానిక ఎన్నికలు జరిగాయి. పదవీకాలం 2011లో ముగిసినా.. ఇప్పటికి ఎన్నికల్ని నిర్వహించటం లేదు. వారు చెప్పేదానికి.. చేసేదానికి ఏ మాత్రం పొంతన ఉండదు’ అని దులిపేశారు. నిజమే.. ప్రధాని మోడీ చెప్పినట్లు.. తరచూ విమర్శలు చేసే కాంగ్రెస్ తాను చేయాల్సింది ఎందుకు చేయదన్నది అసలు ప్రశ్న.
బెంగాల్ లో కమలవికాసంపై భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్న మోడీషాలు.. ఆ రాష్ట్ర ప్రజల మనసుల్ని దోచుకునేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ తరచూ చిరాకు పడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల వేళలోనే రాజకీయాలు.. మిగిలిన రోజులంతా ప్రజాక్షేమం కోసమేనని చెప్పే ఆయన మాటలు ఇటీవల కాలంలో ప్రభావాన్ని చూపించటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో జరుగుతున్న రైతు ఉద్యమం.. నాలుగు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికి పరిష్కారం రాలేదు.
ఇదిలా ఉంటే.. గడిచిన రెండు రోజులుగా ఢిల్లీకి వేలాదిగా రైతులు వస్తున్న వైనం.. ఏం జరుగుతుందో అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. తనకు కొరుకుడుపడని రైతుల ఉద్యమంపై మోడీ సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ మాటలకు తగ్గట్లే.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని.. వారి నిజస్వరూపం తాను బయటపెడతానని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీ పై ఫైర్ అయ్యారు.