Begin typing your search above and press return to search.
దీదీ మీ కాలు నా తలపై పెట్టండి కొట్టండి: మోడీ
By: Tupaki Desk | 21 March 2021 2:33 PM GMTబెంగాల్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని మోడీ, అమిత్ షా ఓవైపు.. బెంగాల్ సీఎం మమత ఓవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
తాజాగా మోడీ బెంగాల్ లో ప్రచారం నిర్వహించారు. మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మమత కాలితో నా తలపై తన్నుతున్నట్లుగా.. ఫుట్ బాల్ ఆడుతున్నట్లుగా బెంగాల్ వీధుల్లో గోడలపై దీదీ మనుషులు చిత్రాలు రూపొందిస్తున్నారని.. దీదీ మీరు ఎందుకు బెంగాల్ సంస్కృతి సంప్రదాయాలు అవమానిస్తారు? కావాలనుకుంటే మీరు నా తలపై మీ కాలిని పెట్టండి.. నన్ను తన్నండి..’’ అంటూ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీదీ, బెంగా అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను తన్నేందుకు నేను మిమ్మల్ని అనుమతించను అంటూ మోడీ చురకలు అంటించారు. మమతకు ఎక్కువగా కోపం వస్తోందని.. నా ముఖం నచ్చడం లేదని అంటోందని మోడీ సెటైర్లు వేశారు. దీదీ ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ ముఖ్యం కానీ ముఖం కాదు అని మోడీ కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ పథకాలతో నడుస్తుంటే.. టీఎంసీ మాత్రం కుంభకోణాలతో నడుస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. పదేళ్లు బెంగాలీలతో ఆడుకున్న మమత ఆటలు ఇక సాగవని మోడీ అన్నారు. బెంగాల్లో మమత ఆట ముగిసిందని అన్నారు. త్వరలోనే నిజమైన అభివృద్ధి బీజేపీతో సాధ్యమవుతుందని అన్నారు.