Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ పై గంటన్నర పాటు మోడీ ఫైరింగ్!
By: Tupaki Desk | 8 Feb 2022 5:30 AM GMTరాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ లోపలి రాజకీయ నేత నిద్ర లేచారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. ఆ పార్టీ చేస్తున్న తప్పుల్ని.. వారి వైఫల్యాల్ని ఏకరువు పెడుతూ నాన్ స్టాప్ గా విరుచుకుపడ్డారు.
ఒక దశలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. పరిస్థితి చూస్తుంటే.. రానున్న మరో వందేళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదన్న గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా ఉందని మండిపడ్డారు.
ఎన్నికల్లో గెలవాలన్న ఆశ.. కాంక్ష కాంగ్రెస్ పార్టీలో ఏ కోశాన కనిపించడం లేదన్న ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పై మరింత మండిపాటును వ్యక్తం చేశారు. తనకేదీ దక్కనప్పుడు అన్నింటినీ వీలైనంతగా పాడు చేద్దామన్న స్థాయికి దిగజారింది అంటూ ఎద్దేవా చేశారు.
వరుస పెట్టి ఎన్నికల్లో ఓడుతున్నా.. కాంగ్రెస్ పార్టీకి అహంకారం మాత్రం తగ్గలేదన్నారు. గంటన్నర పాటు నాన్ స్టాప్ గా ప్రసంగించిన ప్రధాని మోడీ.. తన ప్రసంగంలో అత్యధిక భాగం కాంగ్రెస్ ను తూర్పార పట్టటానికే సమయాన్ని వెచ్చించారు. మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
- వరుసగా ఎన్ని ఎన్నికల్లో ఓడుతున్నా కాంగ్రెస్ పార్టీకి అహంకారం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. చూస్తుంటే మరో వందేళ్ల దాకా అధికారంలోకి రావద్దని గట్టి పట్టుదలతో ఉన్నట్టుంది. గెలవాలన్న కాంక్షే వారిలో ఏ కోశానా కన్పించడం లేదు. అందుకే, తనకేదీ దక్కనప్పుడు అన్నింటినీ వీలైనంతగా పాడుచేద్దామనే స్థాయికి దిగజారింది.
- ప్రతిదాన్నీ గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టకుంది. వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తోంది. బ్రిటిష్‌వాళ్లు పోయినా వారి విభజించి పాలించే సూత్రాన్ని స్వభావంగా మార్చుకుంది. అందుకే టుక్డే టుక్డే గ్యాంగులకు లీడర్‌గా మారింది.
- కరోనా తొలి వేవ్ సమయంలో అంతా ఇళ్లకు పరిమితమై లాక్‌డౌన్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం ముంబై రైల్వేస్టేషన్లో వీరంగం వేసింది. అమాయక కార్మికులకు ఉచితంగా టికెట్లు పంచి, భయపెట్టి సొంత రాష్ట్రాలకు పారిపోయేలా చేసింది. విభజించే మనస్తత్వం కాంగ్రెస్ డీఎన్‌ఏలోకి ఇంకిపోయింది. సమాజంలో వేర్పాటు బీజాలు నాటజూస్తోంది.
- ఉదయం లేచింది మొదలు నిత్యం మోదీ నామ జపమే కాంగ్రెస్‌కు పనిగా మారింది. నా పేరు తలవకుండా బతకలేకపోతోంది. బీజేపీ ఏదైనా ఎన్నికల్లో ఓడితే దానిపై నెలలపాటు లోతుగా విశ్లేషించుకుంటుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఆ అలవాటూ లేదు, అహంకారమూ తగ్గదు. దాని మనోగతం, మాటతీరు, చేసే తప్పుడు పనులు చూస్తుంటే మరో వందేళ్ల దాకా అధికారంలోకి రావద్దని అనుకుంటోందేమోనని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. వాళ్ల ఉద్దేశం అదే అయితే అందుకవసరమైన ఏర్పాట్లు చేసే ఉంచాను.-
- మేం దేశీయతకు పెద్దపీట వేస్తున్నాం. ఇది గాంధీ కలలను సాకారం చేయడం కాదా? దాన్నీ, మేం తెచ్చిన యోగా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. 1971 నుంచీ పేదరిక నిర్మూలన నినాదాలతోనే ఆ పార్టీ ఎన్నికలు నెగ్గుతూ వచ్చింది. పేదరికమైతే పోలేదు గానీ జనం కాంగ్రెస్‌నే సాగనంపారు. చాలా రాష్ట్రాల్లోనైతే దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉంచారు. ఎన్నికలు ముఖ్యం కాదు. కావాల్సింది చిత్తశుద్ధి.
- కోవిడ్ అనంతరం ప్రపంచ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ అవకాశాన్ని భారత్ విడిచిపెట్టొద్దు. కరోనా సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొన్న తీరు ప్రపంచానికే ఆదర్శం. 50 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీని దేశమంతటా ప్రజలు వరుసబెట్టి ఎందుకు తిరస్కరిస్తూ వస్తున్నారో ఆలోచించుకోవాలి. చాలా రాష్ట్రాల్లో మిమ్మల్ని దశాబ్దాలుగా ఓడిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా సరే, అక్కడా కాంగ్రెస్‌ను శాశ్వతంగా తుడిచిపెట్టేశారు.
- తమిళనాడులో కాంగ్రె్‌సను 1967లోనే తుడిచిపెట్టారు. ఉత్తరప్రదేశ్, బిహార్, గుజరాత్‌లలో ఎన్నో ఏళ్ల క్రితం 1985లో గెలిచింది. నాగాలాండ్‌లో 1998లో సాగనంపారు, ఒడిసాలో 24 ఏళ్ల క్రితమే మిమ్మల్ని ఇంటికి పంపారు. గోవా ఎన్నో ఏళ్లపాటు దరికి రానివ్వలేదు పశ్చిమ బెంగాల్‌లో చివరిసారిగా 1972లో గెలిచారు. తెలంగాణ మేమే ఇచ్చామని మీరు చెప్పుకొంటారు.. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.
- తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించేందుకు ఆ రాష్ట్ర ప్రజలంతా కదలివచ్చారు. ఈ విషయంలో కూడా తమిళ సెంటిమెంట్లను గాయపరిచేలా ప్రవర్తించిన చరిత్ర కాంగ్రెస్‌ది.
- యూపీఏ హయాంలోనే ద్రవ్యోల్బణం 10శాతం పైగా ఉంది. మేం అధికారంలోకి వచ్చాక 2014-2020 మధ్య ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తగ్గింది. ధరల పెరుగుదల కాంగ్రెస్ తొలి ప్రధాని నెహ్రూ కాలంలో కూడా ఉండేది. రూ.15కు మినరల్ వాటర్ బాటిల్ కొనే వారు గోధుమలు, బియ్యం ధరలు పెరిగితే ఎందుకు భరించలేరంటూ యూపీఏ హయాంలో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. మాకు మాత్రం ధరల నియంత్రణే ప్రాథమిక లక్ష్యం.
- ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రతిపక్షాలు విమర్శించడం హాస్యాస్పదం. కమిషన్లు, ముడుపులు లేకుండా చేసినందుకే వారు ఈ విమర్శలు చేస్తున్నారు. మేం చిన్న రైతులకు సాధికారత కల్పించాలనుకుంటే వారు చిన్న రైతుల్ని శత్రువులుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇంకా 2014లోనే నిలిచిపోయినందునే వరుస ఓటములు ఎదుర్కొంటున్నారు.
- కరోనా సంక్షోభ సమయంలో మా ప్రభుత్వం 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసింది. ‘భారతదేశం ఆత్మనిర్భరం కావడం మీకు ఇష్టం లేదా? రక్షణ రంగంలో కూడా మేము ఆత్మ నిర్భరత సాధిస్తున్నాం. ఫిట్ ఇండియాను, యోగాను కూడా కాంగ్రెస్ ఎగతాళి చేసింది. రైతుల పేరుతో రాజకీయాలు చేసే హక్కు ఎవరికీ లేదు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్లయినా బానిస మనస్తత్వాన్ని కోల్పోలేదు.