Begin typing your search above and press return to search.

ఎర్రకోట మీద ఎగిరిన జాతీయ జెండా

By:  Tupaki Desk   |   15 Aug 2015 4:12 AM GMT
ఎర్రకోట మీద ఎగిరిన జాతీయ జెండా
X
ఎర్రకోట మీద జాతీయ పతాకం మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రతి ఆగస్టు 15న జెండా వందనం నిర్వహించటం తెలిసిందే. అదే రీతిలో ఈ రోజు ఉదయం 7.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

ఉదయం 7.15 గంటలకే ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని సరిగ్గా 7.30 గంటల సమయానికి త్రివర్ణ పతకాం ఉన్న వేదిక వద్దకు వచ్చారు. అనంతరం ఆయన జెండా వందనం చేపట్టారు. ముడుల నుంచి విడుదలైన త్రివర్ణ పతాకం.. దేశంలో స్వాతంత్య్రాన్ని ప్రతిబింబించేలా రెప రెపలాడింది. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ రెండోసారి ఎర్రకోట మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. పలువురు కేంద్రమంత్రులు.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ అధినేతలు.. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు.

భిన్నత్వంలో ఏకత్వమన్న భావన ప్రపంచానికి దిక్యూచి లాంటి.. కొత్త ఆలోచనలు.. ఆవిష్కరణలతోనే దేశం పురోగతి. మత మౌఢ్యానికి చోటు ఉండరాదన్నారు. మహాపురుషుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య ఫలాలు. నిత్య నూతన సంకల్పంతో ఈ దేశంలో ముందుకు సాగుతోంది.

125 కోట్ల ప్రజానీకం టీమిండియాగా పని చేస్తే.. దేశం సమున్నత స్థానంలోకి చేరుతుంది. ఏడాది పాలన అనంతరం.. సరికొత్త విశ్వాసంతో తాను పెట్టుకున్న లక్ష్యాల్ని సాధించగలనన్న నమ్మకంతో ఉంది. గత ఆగస్టు 15న ప్రధానమంత్రి జనధన యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి భారీ స్పందన లభించింది. జీరో బ్యాలెన్స్ తో పేదలు బ్యాంకు ఖాతాలు తెరవొచ్చని చెబితే.. అందుకు భిన్నంగా రూ.20 వేల కోట్ల రూపాయిలు జమ చేశారు. మొత్తం 17 కోట్ల మంది పేదలు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు తెరిచారన్నారు. తమ హయాంలో అమలు చేస్తున్న పలు పథకాల గురించి మోడీ వివరిస్తున్నారు.