Begin typing your search above and press return to search.
కేటీఆర్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిన మోడీ
By: Tupaki Desk | 29 Nov 2017 4:50 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనపై కొత్త చర్చ మొదలైంది. ఈ టూర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో దూరం పాటించినట్టుగా కన్పించిందని అంటున్నారు. మెట్రో రైలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభ కార్యక్రమాలకు వస్తున్న ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ - మంత్రివర్గ సహచరులతో కలిసి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. సీఎం తన మంత్రివర్గ సహచరులను ప్రధానమంత్రికి పరిచయం చేశారు. బేగంపేట నుంచి ప్రధానమంత్రి మోడీ మియాపూర్ కు చేరుకున్న తరువాత అక్కడి నుంచి పైలాన్ వరకూ మోడీ వాహనంలో కేసీఆర్ ఎక్కే ప్రయత్నం చేశారు. కానీ ఎస్ పీజీ అధికారులు వారించారని సమాచారం.
ఈ తీరు ఆ తరువాత కూడా కొనసాగిందని తెలుస్తోంది. మియాపూర్‌లో మెట్రో ప్రారంభం మంత్రి కేటీఆర్ ప్రధాని వెన్నంటి ఉన్నారు. మెట్రోరైలు ప్రయాణంలో మోడీ పక్కనే కేటీఆర్, ఆ పక్కన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూర్చున్నారు. ప్రయాణం సాగినంత సేపు మోడీతో కేటీఆర్ మాట్లాడుతూనే ఉన్నారు. కేసీఆర్ మాత్రం మౌనం వహించి దూరం కూర్చుండటం కనిపించిందని అంటున్నారు. ఆయనను మోడీ కూడా పలకరించలేదని సమాచారం. దాంతోపాటు తమ పార్టీకి చెందిన బీజేపీ నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని చెప్తున్నారు. కాగా, మియాపూర్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా.. అర్బన్ డెవలప్ మెంట్ మినిస్టర్ కేటీఆర్ లేకుండా ప్రధాని మోడీ రిబ్బన్ కట్ చేయలేదు. రెండు మూడు క్షణాల పాటు మోడీ.. కేటీఆర్ కోసం చూశారు. తనకు కుడివైపున ఉన్న కేటీఆర్ ను గుర్తించి.. తన వద్దకు పిలిపించుకుని రిబ్బన్ కట్ చేశారు.
కాగా, జీఈఎస్ వేదికపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగించింది నాలుగు నిమిషాలపాటే అయినా...ఆయన ప్రసంగం స్వీట్ ఆండ్ షార్ట్ గా సాగిందని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన పథకాలు - అభివృద్ధి కార్యక్రమాలు వివరించడంతోపాటు దేశంలో.. ప్రపంచపటంలో తామెక్కడున్నామో చెప్తూ ప్రసంగించిన తీరు ప్రతినిధులను ఆకట్టుకుందని టీఆర్ ఎస్ వర్గాలు చెప్తున్నాయి.