Begin typing your search above and press return to search.
మోడీ ఆధ్వర్యంలో 4 క్విట్ ఇండియాలు
By: Tupaki Desk | 31 July 2017 5:11 AM GMTఅప్పట్లో మహాత్ముడు ఆగస్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెల్ల దొరలు దేశం వదిలిపోవాలంటూ.. పెద్ద ప్రకంపనాలు సృష్టించిన ఉద్యమం అది. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ.. తన సారథ్యంలో అదే ఆగస్టు 8వ తేదీ నాటికి నాలుగు క్విట్ ఇండియా ఉద్యమాలు ప్రారంభించాలని ప్రతిజ్ఞ చేస్తున్నారు. తాజాగా మోడీ.. అపరిశుభ్రత వెళ్లిపోవాలి, పేదరికం వెళ్లిపోవాలి, ఉగ్రవాదం వెళ్లిపోవాలి, కులతత్వం వెళ్లిపోవాలి... అంటూ మన సమాజానికి పట్టిన నాలుగు రుగ్మతలు తొలగిపోవాలనే ఉద్దేశంతో నాలుగు క్విట్ ఇండియా ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం అప్పట్లో అందరూ చాలా త్యాగాలు చేసి కలసికట్టుగా ఉద్యమాలు నడిపారని, ఇవాళ మనం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని.. కలసి కట్టుగా ఉంటే చాలునంటూ ప్రధాని కోరుతున్నారు.
నరేంద్ర మోడీ ప్రధాని అయిన నాటినుంచి కొన్ని నిర్ణయాలు ప్రజలను ఇక్కట్ల పాల్జేసిన వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. అవినీతి ఊసులేని అంతో ఇంతో నిజాయితీతో కూడిన పాలన అందుతోందనే నమ్మకం ప్రజల్లో కూడా ఏర్పడుతోంది. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి నరేంద్రమోడీ నిత్యం మన్ కీబాత్ లాంటి కార్యక్రమాల ద్వారా వారితో మమేకమౌతున్నారు. నోట్ల రద్దు చేసినా, జీఎస్టీ వంటి ఎవ్వరికీ సరిగా అర్థం కాని కొత్త పన్ను విధానం తీసుకువచ్చినా.. ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత పెద్దస్థాయిలో వ్యక్తం కాకుండా.. జాగ్రత్తగా మోడీ మేనేజి చేయగలిగారు. తనకు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ ను ఆయన ఆ రకంగా ప్రభుత్వానికి అనుకూలంగా వాడారు.
ప్రధాని గతంలో పిలుపు ఇచ్చిన స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలకు కూడా ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది. ఆ స్పూర్తితోనే అన్నట్లుగా ఇప్పుడు ఆయన ఈ క్విట్ ఇండియా ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నారు. అపరిశుభ్రత వెళ్లిపోవాలి అనే ఉద్యమం ఇప్పటికే చాలా ముందుకు వచ్చినట్లు లెక్క. స్వచ్ఛ భారత్ నినాదంతో ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు అవగాహన కలిగించారు. ఆ ఉద్యమం ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్లిపోయినట్లే. ఇక ‘పేదరికం వెళ్లిపోవాలి’ అనే ఉద్యమం సక్సెస్ కావడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ముఖ్యం. అలాగే ఉగ్రవాదం వెళ్లిపోవాలి అనడానికి మాత్రం ప్రజల సహకారం కూడా పూర్తిగా అవసరం అవుతుంది. ఇక చివరిదైన కులతత్వం వెళ్లిపోవాలి అంటూ మోడీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపు బాగానే ఉంది గానీ.. అసలు రాజకీయ నాయకులే దీనికి సహకరిస్తారా? అనేది అనుమానం! మనదేశంలో.. యావత్తూ రాజకీయాలు అనేవి కులతత్వం మీద ఆధారపడే మనుగడ సాగిస్తున్నాయి. కులాలు లేకపోతే.. దుకాన్ బంద్ అయ్యే పొలిటికల్ పార్టీలు మనకు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. కులాల వారీగా ఓట్లు దండుకునే ఆలోచనలు చేయడంలో భాజపా కూడా భిన్నమైనదేమీ కాదు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మోడీ ఎలా నడుపుతారో చూడాలి.