Begin typing your search above and press return to search.
బర్త్ డే బాయ్ కి విషెస్ కోసం పాక్ కు మోడీ!
By: Tupaki Desk | 25 Dec 2015 10:02 AM GMTసాధారణంగా అంతర్జాతీయ రాజకీయాలో అనూహ్యమైన పరిణామాలు అంటూ ఏమీ ఉండవు. భేటీల దగ్గర నుంచి నిర్ణయాల వరకూ అన్నీ కూసింత ప్లానింగ్ తోనే సాగుతుంటాయి. అలాంటిది.. అందరికి షాకిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి అప్ఘనిస్థాన్‌కు వెళ్లి.. అక్కడ నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి.. అక్కడి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఇంత వరకూ షెడ్యూల్ ప్రకారం సాగిన మోడీ జర్నీకి సంబంధించి ప్రధానే స్వయంగా ఒక ట్వీట్ చేయటం సంచలనంగా మారింది. తాను ఈ మధ్యాహ్నం లాహోర్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలుసుకోబోతున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ రోజు నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు కావటం.. ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయన లాహోర్ లో దిగనున్నట్లు చెబుతున్నారు. పాక్ ప్రధానికి తాను ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పినట్లుగా మరో ట్వీట్ లో పేర్కొన్నారు. లాహోర్ లో నవాజ్ షరీఫ్ ను కలుసుకోనున్నట్లుగా మోడీ చేసిన ట్వీట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. వాస్తవానికి వీరిద్దరూ వచ్చే ఏడాది సెప్టెంబరులో సార్క్ సమావేశాల సందర్భంగా కలవాల్సి ఉంది.
పాక్ తో భారత్ కు సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో.. నవాజ్ తో మోడీ స్నేహం ఒక ఎత్తు అయితే.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అందరిని ఆశ్చర్యపరుస్తూ మోడీ స్వయంగా లాహోర్ వెళ్లి శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ మలుపు తిరగనున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు.