Begin typing your search above and press return to search.

పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ఇప్పుడిలా ఫైర్ ఏంది బాబు?

By:  Tupaki Desk   |   4 Sep 2018 5:30 AM GMT
పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ఇప్పుడిలా ఫైర్ ఏంది బాబు?
X
త‌న‌ను తాను పొగుడుకునే విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా. మంది మార్బ‌లానికి ఢోకా లేకున్నా.. బాబును పొగిడే విష‌యంలో తెలుగు త‌మ్ముళ్లు ఎప్పుడూ వెనుక‌బ‌డే ఉంటారు. ఈ కొర‌త‌ను తీర్చుకోవ‌టానికి వీలుగా ఆయ‌న త‌న గురించి తాను గొప్ప‌లు చెప్పుకొని అడ్డంగా బుక్ అయిపోతుంటారు.

జ‌నాల మెమ‌రీ మ‌రీ త‌క్కువ‌గా అనుకుంటారేమో కానీ.. సంద‌ర్భానికి త‌గిన‌ట్లుగా మాట‌ను మార్చేసే బాబు మార్క్ వ్యూహాన్ని జ‌నం ఇప్పుడు బాగానే గుర్తు పెట్టుకుంటున్న ప‌రిస్థితి. గ‌తంలో మాదిరి ఆధారాల కోసం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి. ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చిన సోష‌ల్ మీడియా పుణ్యమా అని పాత ముచ్చ‌ట్ల క్లిప్పులు కుప్ప‌లు కుప్ప‌లుగా గూగుల్ లో దొరికే ప‌రిస్థితి.

పెద్ద నోట్ల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన వెంట‌నే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. అదంతా త‌న ఐడియానేన‌ని.. పెద్ద‌నోట్ల ర‌ద్దు చేయాల‌ని తాను ప్ర‌ధాని మోడీకి త‌గ‌తంలోనే స‌ల‌హా ఇచ్చిన‌ట్లుగా బాబు చెప్పేవారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు విష‌యంలో తొలుత వ‌చ్చిన మైలేజీలో త‌న వాటా తాను పొందాల‌న్న తొంద‌ర్లో కితాబుల మీద కితాబులు ఇచ్చేసిన ప‌రిస్థితి.

ఇప్పుడేమో మోడీని ఆకాశానికి ఎత్తేసిన చంద్ర‌బాబు.. తాజాగా నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో పెద్ద‌నోట్ల ర‌ద్దు ముచ్చ‌ట‌పై దేశ ప్ర‌జ‌లంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు కార‌ణంగా దేశంలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన న‌ల్ల‌ధ‌నం కాస్తా వైట్ గా మారుతుంద‌ని.. దీంతో.. ఇంత‌కాలం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో చేర‌ని బ్లాక్ మ‌నీ బ‌య‌ట‌కు వ‌చ్చేసి.. ప్ర‌భుత్వానికి భారీ ఎత్తున ఆదాయంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

అయితే.. సీన్ రివ‌ర్స్ అయి.. పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా శ్రామికులు.. క‌ర్ష‌కులు.. చిన్న వ్యాపార‌స్తులు దారుణంగా దెబ్బ తిన్నారు. ఇక‌.. న‌గ‌దు కోసం సామాన్యులు కోల్పోయిన ప‌ని గంట‌లు వంద‌ల కోట్ల‌ల్లో ఉన్నాయ‌ని చెప్పాలి. ఇంత భారీ న‌ష్టాన్ని తాజాగా బాబు తెర మీద‌కు తెస్తున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని అమ‌లు చేయొద్ద‌ని.. ఒక‌వేళ చేస్తే.. వంద‌.. యాభై నోట్ల‌తో అమ‌లు చేయాల‌ని అప్పుడే తాను చెప్పిన‌ట్లుగా కొత్త ప‌ల్ల‌విని అందుకున్నారు. బాబు మాట‌ల్ని చూస్తే.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే తీరులో క‌నిపించ‌క మాన‌దు.

మోడీ మిత్రుడిగా ఉన్న‌ప్పుడు పెద్ద నోట్ల ర‌ద్దును భుజాన వేసుకొని ప్ర‌ధానమంత్రిని నెత్తిన పెట్టుకొని ఊరేగిన వైనాన్ని ఇప్పుడు ప‌లువురు గుర్తు చేసుకుంటున్నారు. ఎంత చెడితే మాత్రం మోడీపైనా.. ఆయ‌న అమ‌లు చేసిన పెద్ద‌నోట్ల‌ర‌ద్దు మీదా అంత‌లా వ్యాఖ్య‌లు చేయాలా? అన్న ప్ర‌శ్న వ్య‌క్త‌మ‌వుతోంది.