Begin typing your search above and press return to search.

ఉత్తర కొరియా కు షాక్ ఇచ్చిన ఇండియా

By:  Tupaki Desk   |   1 May 2017 9:10 AM GMT
ఉత్తర కొరియా కు షాక్ ఇచ్చిన ఇండియా
X
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నంతగా ఉత్తరకొరియా - అమెరికాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ క్రమంలో ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకే సవాల్ విసురుతూ.. ఐక్యరాజ్య సమితి సూచనలనూ ఉల్లంఘిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ కు భారత్ నుంచి కూడా వ్యతిరకేత వ్యక్తమైంది. ఉత్తర కొరియాకు తెలిసి వచ్చేలా ఓ ఆకస్మిక నిర్ణయంతో మోదీ ప్రభుత్వం సడన్ షాకిచ్చింది. ఉత్తర కొరియా సైనికులకు ఇండియాలో ఇస్తున్న ట్రైనింగును నిలిపేసింది.

అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉత్తరకొరియా సైనికాధికారులకు భారత్ దేశంలోని ప్రధాన భాషల్లో శిక్షణ ఇస్తున్నారు. 2008 నుంచి మహారాష్ట్రలో ఉత్తర కొరియా సైనికాధికారులు పలు దఫాలుగా భారతీయ భాషల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఏర్పడిన పరిణామాలతో ఉత్తర కొరియా వైరి దేశం దక్షిణ కొరియా.. భారత్‌కు ఓ విన్నపం చేసింది. ఉత్తర కొరియా సైన్యానికి భారతీయ భాషలు నేర్పడం ఆపేయాలనీ, అంతే కాకుండా ఆ దేశ సైన్యానికి ఉపకరించేలా ఎటువంటి సహాయం చేయకూడదని మన ప్రభుత్వాన్ని కోరింది.

దీంతో ఐక్యరాజ్య సమితి సూచనలు, దక్షిణ కొరియా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం విస్పష్ట నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియాసైన్యానికి ఇకపై భారతీయ భాషలను నేర్పేది లేదనీ, శిక్షణను తక్షణమే నిలిపివేస్తున్నామంటూ ప్రకటించింది. ఏప్రిల్ 21న దీనికి సంబంధించిన గెజిట్ నోట్‌ను కూడా విడుదల చేసింది. మరి దీనిపై చైనా, ఉత్తర కొరియాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/