Begin typing your search above and press return to search.
మోడీకి ఇస్తే ఇత్తడి రేట్.. సీఎంలకు అదే బంగారు రేట్ నా? ఇదేమిటబ్బా?
By: Tupaki Desk | 13 May 2021 11:30 AM GMTవడ్డించేవాడు మనవాడైతే ఏ మూలకు కూర్చున్నా ఒక ముక్క ఎక్కువగానే దొరుకుతుందట.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పరిస్థితి అలానే ఉందట.. వ్యాక్సినేషన్ విషయంలో తేలిపోయిన బీజేపీ ప్రభుత్వం చివరకు వ్యాక్సిన్ల ధరలను నియంత్రించడంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి చీప్ గా.. రాష్ట్రాలకు భారీగా రేటుకు అమ్ముతున్నాయి. ఈ వ్యాక్సిన్ ధరలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా మొదటి వేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్నారని.. ముందే లాక్ డౌన్ వేసి మోడీ దేశానికి పెను విపత్తు తప్పించాడని ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కానీ సెకండ్ వేవ్ తో మోడీ రాత మారింది. సడెన్ గా వచ్చిపడ్డ దీన్ని ఎదుర్కోవడంలో మోడీ ఫెయిల్ అయ్యాడని అందరూ ఆడిపోసుకుంటున్నారు. దేశం పరిస్తితి ప్రస్తుతం చేయిదాటిపోయిందని.. మోడీ చేష్టలుడిగి చూస్తున్నాడని విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ల విషయంలో మోడీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని అంటున్నారు. ముందే మేలుకొని ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లను దేశానికి పంచడంలో మోడీ ఫెయిల్ అయ్యాడని ఆడిపోసుకుంటున్నారు.
వ్యాక్సిన్ విషయంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉందని గ్రామాల్లో సైతం చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మోడీని ఏమీ చేయలేక వాళ్లకు వాళ్లే తిట్టుకుంటున్న పరిస్థితులున్నాయట.. వ్యాక్సిన్ ధరలను కేంద్ర ప్రభుత్వానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 ధరకు రేట్ ఫిక్స్ చేశారంట అని సోషల్ మీడియాలో మోడీ సర్కార్ తీరును కడిగేస్తున్న పరిస్థితులున్నాయట.. ఇదే ఇప్పుడు హల్ చల్ అవుతోంది.
ఒకటే వ్యాక్సిన్ రెండు ధరలు ఏంటి? అని.. ఇది ఎక్కడి రాజ్యాంగం అని పెద్ద ఎత్తున రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయంట.. ఒకే దేశం.. ఒకటే పాలన అని ముందుకెళుతున్న మోడీ ఇలాంటివి ఎన్నో చేశాడు. ఒకటే హిందీ భాష ఉండాలన్నారు. ఇక ఒకటే పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలని జమిలి ఎన్నికలకు ప్లాన్ చేశాడు. అయితే ఇలా అన్ని ఒకటే అని.. వ్యాక్సిన్ల విషయంలో మాత్రం కేంద్రానికి ఒకరేటును.. రాష్ట్రానికి మరో రేటును ఎలా ఫిక్స్ చేస్తావ్ మోడీ సార్ అని పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.