Begin typing your search above and press return to search.
అపర మేధావి స్వామికి మోడీ సర్కారు మామూలు షాక్ ఇవ్వలేదుగా?
By: Tupaki Desk | 15 Sep 2022 4:28 AM GMTసొంత పార్టీనా.. ప్రత్యర్థి పార్టీనా అన్న తేడా లేకుండా.. తమతో లెక్కలు బాగుండే వారితో ఒకలా.. తేడాగా ఉండే వారితో మరోలా వ్యవహరించే తీరు మోడీషాలలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. తమకు నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేసి.. తేడా వచ్చినోళ్లను పాతాళానికి తొక్కేసే టాలెంట్ మోడీకి ఎక్కువనే చెప్పాలి. బీజేపీ అన్నంతనే గుర్తుకు వచ్చే తన గురువు అద్వానీకే జీవితంలో మరెవరూ ఇవ్వలేనంత భారీ షాకిచ్చిన మోడీకి.. మిగిలిన వారంతా ఎంత? అన్న ప్రశ్న వేసుకుంటేనే.. ఆయనేమిటి? అన్నది ఇట్టే అర్థమైపోతుంది.
అలాంటి మోడీ నేత్రత్వంలోని కేంద్ర సర్కారు తాజాగా బీజేపీకి చెందిన మాజీ ఎంపీ కమ్ అపర మేధావిగా అందరి మన్ననలు పొందు సుబ్రహణ్య స్వామికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాంటి అనుభవాన్ని ఎదురయ్యేలా చేసిందని చెప్పాలి. ఏదో మేధావి.. పార్టీని నమ్ముకొని ఉన్నారనుకొని రాజ్యసభకు పంపితే.. పదవి వచ్చిన నాటి నుంచి సొంత పార్టీని సైతం తన వ్యాఖ్యలతో ఇరుకున పెట్టేసే టాలెంట్ సుబ్రహణ్య స్వామికి కాస్తంత ఎక్కువనే విషయం తెలిసిందే.
అలాంటి ఆయనకు ఇప్పటికే రాజ్యాసభకు రెన్యువల్ చేయకపోవటం ద్వారా.. పార్టీలో ఆయన సీన్ దాదాపు అయిపోయిందన్న సంకేతాన్ని బీజేపీ అధినాయకత్వం ఇచ్చేసిందని చెప్పాలి. ఎంపీగా ఉన్న వేళలో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల గడువును ఇస్తూ నోటీసులు పంచింది.
ఢిల్లీ లోని స్వామి ఉంటున్న నివాసం 2016 జనవరిలో కేంద్రం అధికారికంగా కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఇతర ఎంపీలకు కేటాయించాల్సి ఉన్నందున ఆయన్ను ఖాళీ చేయాలని కోర్టు సూచన చేసింది. కోర్టు నుంచి వచ్చిన షాకింగ్ ఆదేశాల నేపథ్యంలో స్వామి స్పందించారు. బంగ్లాను ఖాళీ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
2016లొ తనకు రాజ్యసభ పదవి ఇవ్వక ముందే.. భద్రతా కారణాల కారణంగా తనకు జెడ్ ప్లస్ కేటగిరిలో ఢిల్లీలో బంగ్లాను కేటాయించారని చెప్పారు. అందుకే తాను రాజ్యసభ సభ్యుడినైన తర్వాత కూడా ఇదే బంగ్లాను వినియోగించినట్లుగా పేర్కొన్నారు. తనకు బంగ్లా కావాలని ఎప్పుడూ ఎవర్నీ అడగలేదన్న ఆయన.. పాత ఒప్పందం మళ్లీ కొనసాగుతుందా? అంటూ ప్రశ్నించారు.
కేంద్రం తనకు బంగ్లాకేటాయించలేమని చెప్పినట్లుగా చెప్పిన ఆయన.. తాను బంగ్లా ఖాళీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పటం గమనార్హం. కోర్టు ఆదేశాలుగా కనిపిస్తున్నప్పటికీ.. ఆ తరహా ఆదేశాలతో ప్రభుత్వం నుంచి మొదలు కాకుంటే.. ఇష్యూ ఇంతవరకు వచ్చేది కాదన్నది నిజం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.