Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాకివ్వ‌బోతున్న మోడీ స‌ర్కార్‌..

By:  Tupaki Desk   |   11 July 2022 2:30 PM GMT
జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాకివ్వ‌బోతున్న మోడీ స‌ర్కార్‌..
X
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వాన్ని కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కంట్రోల్ చేయ‌నుందా? ఇక నుంచి జ‌గ‌న్ కోరుకున్న విధంగా.. వైసీపీ స‌ర్కారు ఆశించిన విధంగా ప‌రిస్థితులు ఉండ‌బోవా? కేంద్రం చెప్పిన‌ట్టు న‌డుచుకోవ‌డం.. కేంద్ర పెద్ద‌లు చెప్పింది విన‌డం వంటివి చేయాల్సిందేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఆర్థిక నిపుణులు.. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం ఏ చిన్న అవ‌స‌రం వ‌చ్చినా.. సంచీ ప‌ట్టుకుని డ‌బ్బుల కోసం.. ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తూ.. ఏదో ఒక రూపంలో మచ్చిక చేసుకుని.. మ‌నీ తెచ్చుకుంటోంది. ఇలా తెచ్చుకుంటే త‌ప్ప గ‌డ‌వ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు.. సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు నిధుల కొర‌త వెంటాడుతోంది. ఆదాయం త‌గ్గింద‌ని ... చెబుతున్నా.. ఆదాయం బాగానే ఉంద‌ని.. ప‌న్నులు పెంచార‌ని.. ప్ర‌తి దానిపైనా బాదేస్తున్నార‌ని.. సో.. ఆదాయానికి లోటు లేద‌ని.. ఆర్థిక గ‌ణాంకాలు చెబుతున్నాయి.

అయిన‌ప్ప‌టికీ.. ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చేందుకు.. ఇతర ప‌నులు చేసేందుకు కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించేందుకు.. ప్ర‌భుత్వం ఆప‌శోపాలు ప‌డుతోంది. ఈ క్ర‌మంలో క‌నీస ఖ‌ర్చుల‌కు కూడా అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది . ఈఏడాది ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఇప్ప‌టి వ‌రకు అంటే.. మూడు మాసాల్లో 29 వేల కోట్ల అప్పులు చేసింది.

ఇవ‌న్నీ కూడా కేంద్రం చ‌ల‌వ‌తో.. మోడీ ఆశీస్సుల‌తోనే జ‌గ‌న్ స‌ర్కారు తెచ్చుకున్న అప్పులు. ఈ నిదుల నుంచే.. అమ్మ ఒడి.. ఇత‌ర‌త్రా.. ప‌థ‌కాల‌కు నిధులు వెచ్చిస్తున్నారు. అంతేకాదు.. ఇత‌ర ఖ‌ర్చు లు కూడా ఈ అప్పుల నుంచే చేస్తున్నారు. అయితే.. రోజులు అన్ని ఒకేలా ఉండ‌వ‌ని.. మార్పు స‌హ‌జ‌మ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని మాంద్యం కుదిపేస్తోంది. అన్ని దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ అప్పుల‌కు తాళం వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆర్థిక ప‌రిస్థితి భారత్‌కు కూడా ఇబ్బందులు తెచ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఆర్బీఐ వంటివి అంచ‌నా వేస్తున్నాయి.

దీంతో ముందుగానే మోడీ స‌ర్కారు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. ఆర్థిక నిపుణులు, సంస్థ‌లు.. ప్ర‌పంచ స్థాయి సంస్థ‌లు కూడా హెచ్చ‌రిస్తున్నారు. దీనిలో భాగంగా.. రాష్ట్రాలు చేస్తున్న అప్పులపై నియంత్ర‌ణ‌లు విధించాల‌ని.. మోడీకి సూచిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాలు చేస్తున్న అప్పుల‌ను ప‌రిశీలిస్తే.. ఏపీ ఎక్కువ‌గా అప్పులు చేస్తోంది. మొత్తం 11 రాష్ట్రాలు అప్పులు ఎక్కువ‌గా చేస్తున్నా.. వీటిలోనూ ఏపీ మ‌రింత ఎక్కువ‌గా అప్పుఉ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ వంటి రాష్ట్రాల‌ను నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉందని.. లేక‌పోతే.. శ్రీలంక త‌ర‌హా ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని.. కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఆర్థిక నిపుణులు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా వ్య‌వ‌హ‌రించినా.. ఏపీ విష‌యంలో కేంద్రం నియంత్ర‌ణ విధానాన్ని అనుస‌రించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంటే.. అప్పులు చేసే అవ‌కాశాల‌ను ప‌క్కన పెట్టేందుకు ఉన్న మార్గాల‌ను కేంద్రం అన్వేషించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఏపీని కంట్రోల్ చేయాల‌ని.. కొన్నాళ్లుగా ఆర్థిక వేత్త‌లు కూడా చెబుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే రోజుల్లో ఏపీకి అప్పులు పుట్ట‌డం గ‌గ‌న‌మేన‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.