Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు షాకింగ్ నిర్ణయం: 182 ఏళ్ల చరిత్ర ఉన్న గోశాలలకు సమాధి

By:  Tupaki Desk   |   1 April 2021 7:47 AM GMT
మోడీ సర్కారు షాకింగ్ నిర్ణయం: 182 ఏళ్ల చరిత్ర ఉన్న గోశాలలకు సమాధి
X
దేశంలో ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కానీ.. వాటిల్లో ఏ ఒక్కటి కూడా గోవుల సంరక్షణ కోసం పెద్దగా ప్రయత్నించలేదని.. మోడీ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా గోవుల సంరక్షణ కోసం విపరీతంగా శ్రమిస్తున్నట్లుగా బీజేపీ నేతలు చెబుతారు. ఆ పార్టీకి అనుబంధంగా అన్నట్లు వ్యవహరించే సంఘ్ పరివార్ కానీ.. వీహెచ్ పీ.. భజరంగ్ దళ్ లాంటి హిందూ సంస్థలు మోడీ హయాంలో గోవుల సంరక్షణ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా చెబుతారు.

పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవుల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున నిర్ణయాల్ని తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతులు తెలిసిందే. మరి.. వారు చెప్పినట్లు చూస్తే.. మోడీసర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారాల్సిందే. గోవుల పరిరక్షణ కోసం అంతలా తపించే మోడీ సర్కారు.. అప్పుడెప్పుడో 182 ఏళ్ల క్రితం బ్రిటీష్ రాజ్యంలో ఏర్పాటు చేసిన సైనిక గోశాలలకు చెల్లుచీటి ఇస్తూ నిర్ణయం ఎలా తీసుకున్నారు?

భారత సైనికులకు స్వచ్ఛమైన పాలు అందించేందుకు వీలుగా 1889 ఫిబ్రవరి ఒకటిన తొలి పాడి పశువుల శాలను అలహాబాద్ లోఏర్పాటు చేశారు. అనంతరం సైనిక శిబిరాలు కొలువైన ప్రతి చోటా వీటిని ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశ వ్యాప్తంగా 130 సైనిక పాడి పశువుల శాలలు ఉండేవి. వీటిల్లో 30 వేల ఆవులు ఉండేవి. కశ్మీర్ సరిహద్దులైన కార్గిల్.. లేహ్ ప్రాంతాల్లోని సైనికులకు స్వచ్ఛమైన పాలు అందించేందుకు 1990 చివర్లో గోశాలలు ఏర్పాటు చేవారు.

ఈ గోశాలలు ఎంత భారీ అంటే.. ఏటా 3.50 కోట్ల లీటర్లు పాలు ఈ గోశాలల ద్వారా ఉత్పత్తి అయ్యేవి. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్న గోశాలలకు సమాధి కడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. సైనికులకు పాలు.. పాల పదార్థాల్ని అందజేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక గోశాలలను మూసివేయాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ గోశాలల్లో ఎన్ని ఆవులు ఉన్నాయన్న విషయాన్ని తాజా ఉత్తర్వుల్లో వెల్లడి కాలేదు. కాకుంటే.. రెండేళ్ల క్రితం ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే.. సైన్యం పరిధిలోని వివిధ గోశాలల్లో 25వేలకు పైగా ఆవులు ఉన్నట్లుగా తేల్చారు అంతేకాదు 20వేల ఎకరాల విస్తీర్ణంలో 39 గోశాలలు ఉన్నట్లుగా పాత లెక్కలు చెబుతున్నాయి. వీటిల్లో వెయ్యి మంది వరకుసిబ్బంది పని చేసేవారని.. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వారిని సైన్యంలోని వివిధ విభాగాలకు పంపిస్తూ నిర్నయం తీసుకోనున్నారు. మోడీ సర్కారు అధికారంలోకి రావటంలో కీలకమైన గోవుల విషయంలోనూ కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవటమా అన్న విస్మయం వ్యక్తమవుతోంది.