Begin typing your search above and press return to search.
9 వేల కేజీల బంగారాన్ని అమ్మేసిన మోడీ సర్కార్
By: Tupaki Desk | 10 April 2019 4:34 AM GMTఅవును.. మోడీ సర్కారు 9వేల కేజీల బంగారాన్ని తాజాగా వేలం వేసింది. ఇంతకీ.. ఈ బంగారం ఎక్కడిది? మోడీ సర్కార్ ఎందుకు వేలం వేశారు? అన్న విషయాల్లోకి వెళితే.. ఆ మధ్యన గోల్డ్ మానిటైజేషన్ స్కీం ఒక దాన్ని మోడీ సర్కార్ తెర మీదకు తెచ్చింది. ఈ స్కీంలో భాగంగా ప్రభుత్వం బంగారం బాండ్లను జారీ చేసింది.
నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ప్రభుత్వానికి బాండ్ల రూపంలో ఇస్తే.. దానిపై ప్రభుత్వం 2.5 శాతం వడ్డీరేటును చెల్లిస్తుందని.. బాండ్ల గడువు ముగిసే సమయానికి బంగారం మొత్తానికి సమానమైన నగదును ఇస్తామని ప్రకటించింది. ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తెచ్చేందుకు మోడీ సర్కారు ఈ స్కీంను 2015లో ప్రవేశ పెట్టింది.
ఈ స్కీంలో భాగంగా సేకరించిన బంగారాన్ని షార్ట్ టర్మ్.. మీడియం.. లాంగ్ టర్మ్ కింద బాండ్లు సేకరించారు. షార్ట్ టర్మ్ ను ఒకటికి మూడేళ్ల మధ్య కాలాన్ని.. మీడియం టర్మ్ కింద 5 నుంచి 7 ఏళ్ల మధ్య కాలాన్ని.. లాంగ్ టర్మ్ కింద 12-15 ఏళ్ల మధ్య కాలాన్ని పరిగణిస్తారు.
ఈ పథకంలో భాగంగా ప్రజల దగ్గర నుంచి 15,650 కేజీల బంగారాన్ని సేకరించింది. ఆ బంగారంలో 9వేల కేజీలను ఈ మధ్యనే వేలం వేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వర్గాలు ధ్రువీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇంత భారీగా బంగారాన్ని వేలం వేయటం ద్వారా.. వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచేందుకు అవకాశం వచ్చింది. మీడియం.. లాంగ్ టర్మ్ కింద సేకరించిన బంగారాన్ని మోడీ సర్కారు వేలం వేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎంటీసీ 9వేల కేజీల బంగారం వేలాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.