Begin typing your search above and press return to search.
నేను రూ.1.25లక్షల కోట్ల నిప్పును
By: Tupaki Desk | 12 Feb 2018 10:20 AM GMTజాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయం బాగా వంటబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందు రాహుల్ గాంధీ స్టామీనా ఏంటో తెలియక అధికార పార్టీకి చెందిన నేతలు పప్పు అని సంబోధించేవారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడేం ధైర్యం చేయడంలేదు. ఎందుకంటే ఆయనలో ఇదివరికంటే ఇప్పుడు రాజకీయ పరిణితి కనబడుతోంది.
త్వరలో కర్నాటక ఎన్నికల జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కొద్దిరోజుల క్రితం బీజేపీ బెంగళూరులో నవకర్నాటక నిర్మాణ పరివర్తన సభను ఏర్పాటు చేసింది. ఆ సభలో పీఎం మోడీ ఆమోదం పొందని బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ ..తాము అధికారంలోకి వస్తే ఆ బడ్జెట్ ను అమలు చేస్తామంటూ సూచించారు.
అయితే ఆ బడ్జెట్ గురించి సునిశితంగా - ప్రజలు ఆలోచించేలా రాహుల్ గాంధీ బీజేపీ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా కర్నాటక ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రతీసారి తాము కడిగిన ముత్యమని చెప్పుకునే మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.1.25లక్షల కోట్ల ను రుణమాఫీ చేశారు. అవన్నీ దేశంలో ఉన్న బడాబాబులవేననే విషయాన్ని ప్రస్తావించారు.
నల్లకుభేరుల ఆటకట్టించేందుకు పీఎం మోడీ పెద్దనోట్లు రద్దు చేసి బలి తీసుకోవడం మినహా, సామాన్యుడికి ఆర్థిక విషయాల్లో ఒరిగిందేమీ లేదని అన్నారు. చెప్పాలంటే రాహుల్ గాంధీ చెప్పిన లెక్కల్లో అవినీతి కోట్లలో ఉందంటే దాని వెనుక అవినీతి పర్వం దాగి ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోని రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తున్న కాంగ్రెస్‌కే మరోసారి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.