Begin typing your search above and press return to search.

మన డబ్బులు లాగేసే దిగ్గజాలకు షాకివ్వనున్న మోడీ!

By:  Tupaki Desk   |   9 Feb 2020 4:23 AM GMT
మన డబ్బులు లాగేసే దిగ్గజాలకు షాకివ్వనున్న మోడీ!
X
పేర్లు చెప్పినంతనే వరల్డ్ ఫేమస్. తీరా.. వారి లెక్కలు చూస్తే మాత్రం అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. దేశ ప్రజల నుంచి పలు రకాలుగా డబ్బులు లాగేసే దిగ్గజ కంపెనీల నుంచి పన్ను ఆదాయం రూపంలో ప్రభుత్వానికి పైసా కూడా రావటం లేదట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమంటున్నారు.

మన దగ్గర రకరకాలుగా సేవలు అందించిన కారణంగా డబ్బులు లాగేసే కంపెనీలు గూగుల్.. ఫేస్ బుక్.. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెక్నాలజీ కంపెనీల మీద కొత్త తరహా పన్ను విధించాలని మోడీ సర్కారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ కంపెనీలు దేశ ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగేయటమే కానీ.. అలా వచ్చిన ఆదాయంలో నుంచి కాస్త మొత్తాన్ని పన్ను రూపంలో కట్టటం లేదని చెబుతున్నారు.

విదేశీ సర్వర్ల ద్వారా.. అందునా విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై ఎలాంటి పన్నులు విధించటం లేదు. ప్రభుత్వ విధానాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. అందుకే.. దేశంలో.. మన డేటా ఆధారంగా జరిగే లావాదేవీలు.. యాడ్స్ పైన పన్నువిధించాలని యోచిస్తున్నారు. గ్లోబల్ డిజిటల్ టాక్స్ అనే అంశంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇంతకాలం ప్రభుత్వ అనుసరిస్తున్న విధానం.. పన్నులు కట్టకుండా ఉన్న దిగ్గజ కంపెనీల నుంచి ఆదాయం సమకూరుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెబుతున్నారు. అదే జరిగితే.. వందలాది కోట్లను ఆదాయంగా పొందే దిగ్గజ కంపెనీలకు మోడీ సర్కారు నుంచి భారీ షాక్ తగలనుందని చెప్పక తప్పదు.