Begin typing your search above and press return to search.
కశ్మీర్ అభివృద్ధికి బ్లూప్రింట్..దాని కోసం మంత్రుల కమిటీ!
By: Tupaki Desk | 28 Aug 2019 3:01 PM GMTజమ్మూ కశ్మీర్ కు నిన్నటిదాకా కొనసాగిన స్వయం ప్రతిపత్తిని ఒక్క పోటుతో లేపేసిన ప్రధాని నరేంద్ర మోదీ... ఇప్పుడు తన నిర్ణయంపై కశ్మీర్ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారనే చెప్పాలి. స్వయం ప్రతిపత్తిని కోల్పోయిన కశ్మీర్ ను అన్ని రంగాల్లో అబివృద్ధి చేసేందుకు మోదీ సర్కారు భారీ ప్యాకేజీ ప్రకటించనుంచని మొన్నటి నుంచి పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ ప్యాకేజీ ఏమిటన్న విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషణలు చేశారు. వారందరి విశ్లేషణలను పటాపంచలు చేస్తూ మోదీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
అసలు ఇప్పటిదాకా కశ్మీర్ అభివృద్ది కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న మాటను చల్లగా చెప్పేసిన మోదీ సర్కారు... కశ్మీర్ అభివృద్ధి కోసం తాము చాలానే చేస్తామని తన చర్యల ద్వారా తెలిపింది. అసలు కశ్మీర్ అభివృద్ధికి ఏమేం చేయాలన్న కోణంలో నిర్ణయం తీసుకునే విషయాన్ని నిర్దారించేందుకు ఓ బ్లూ ప్రింట్ ను రూపొందించనున్నామని చెప్పిన మోదీ సర్కారు... ఆ బ్లూ ప్రింట్ బాధ్యతను ఐదుగురు సీనియర్ మంత్రులకు అప్పగించినట్టుగా తెలిపింది. ఈ గురుతర బాధ్యతను ఎవరెవరి మీద పెట్టారన్న విషయానికి వస్తే... మోదీ కేబినెట్ లో సీనియర్ మంత్రులుగా కొనసాగుతున్న రవి శంకర్ ప్రసాద్ - ధర్మేంద్ర ప్రదాన్ - తేవర్ చంద్ గెహ్లాట్ - జితేంద్ర సింగ్ - నరేంద్ర తోమర్ లకు మోదీ ఈ బాధ్యతలు అప్పగించారట.
మంత్రి వర్గ సబ్ కమిటీగా పిలుస్తున్న ఈ ఐదుగురు మంత్రుల బృందం కశ్మీర్ అభివృద్ధికి సంబందించిన బ్లూ ప్రింట్ ను రూపొందించనుందట. అది కూడా అక్టోబర్ నెలాఖరులోగా మోదీకి ఈ కమిటీ సదరు బ్లూ ప్రింట్ ను సమర్పించాల్సించాలట. ఈ బ్లూ ప్రింట్ చేతికి వచ్చాక గానీ కశ్మీర్ అభివృద్ధిపై మోదీ నిర్ణయం తీసుకోరన్న మాట. అయితే కశ్మీర్ అభివృద్ది విషయంలో ఇప్పటికే పలు కీలక అంశాల మీద సమీక్షలు చేసిన మోదీ... ఓ అవగాహనకు వచ్చినా... మరింత స్పష్టత కోసం ఈ కమిటీని వేసినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే... అసలు కశ్మీర్ ప్రజలకు ఏం కావాలి? కశ్మీర్ అబివృద్ది విషయంలో ఏది ముందు చేపట్టాలి? ఏది తర్వాత చేపట్టాలి? అసలు ఆ అభివృద్దిని ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఏమాత్రం నిధులు అవసరమవుతాయి? అన్న విషయాలన్నింటిపైనా ఈ కమిటీ చాలా పకడ్బందీగానే బ్లూ ప్రింట్ ను ఇవ్వనుందట. అంటే... ఈ బ్లూ ప్రింట్ వచ్చేదాకా కశ్మీర్ అభివృద్ధిపై కేంద్రం సింగిల్ స్టెప్ కూడా వేయదన్న మాట. మరి అప్పటిదాకా కశ్మీర్ ప్రజలను మోదీ సర్కారు ఎలా సముదాయిస్తుందో చూడాలి.