Begin typing your search above and press return to search.
ఎంపీ ల్యాడ్స్... మళ్లీ వచ్చింది... కానీ ?
By: Tupaki Desk | 12 Nov 2021 2:30 AM GMTపార్లమెంటు నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్రం ఉద్దేశించిన ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ సౌకర్యాన్ని నరేంద్ర మోడీ సర్కార్ మళ్ళీ పునరుద్ధరించింది. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఎంపీల్యాడ్ ఫండ్స్ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా మొదలుపెట్టింది. 1993వ సంవత్సరంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మొదలుపెట్టిన ఈ పథకాన్ని మొన్నటి కరోనా వైరస్ కారణంగా అంటే 2020 లో నిలిపేశారు. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడం తో పాటు ఆర్థిక రంగంలో కూడా ఊపు మొదలవ్వటం తో కేంద్రం మళ్ళీ మొదలుపెట్టింది.
అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో స్పీడ్ పెంచేందుకు అప్పటి ప్రధానమంత్రి పీవీ ఈ ప్రక్రియను అమల్లోకి తెచ్చారు. ఈ సౌకర్యం ప్రకారం ప్రాధమిక విద్య, ప్రజారోగ్యం, మంచినీటి సౌకర్యం, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ను పార్లమెంట్ సభ్యులు ఉపయోగించచ్చు. ఏడాదికి రు. 5 కోట్లు కేంద్రం నుండి నేరుగా జిల్లాల కలెక్టర్లకు చేరిపోతుంది. పై అంశాలకు సంబంధించి ఎంపీలు తమ లేఖల ద్వారా కలెక్టర్లకు సిఫారసులు చేయవచ్చు.
మామూలుగా అయితే ప్రజల నుంచి వచ్చే డిమాండ్ల ప్రకారం ప్రజాప్రతినిధులు ఎన్నో సిఫారసులు చేస్తుంటారు. అయితే నిధుల లేమి కారణంగా సిఫారసులు సిఫారసుల్లాగే ఉండిపోతున్నాయి. అయితే ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అలాకాదు. ఎందుకంటే పనుల సిఫారసులకు ముందే వాళ్ళ ఖాతాలో ఏడాదికి రు. 5 కోట్లుంటుంది కాబట్టి నిధుల లభ్యతను బట్టి సిఫారసు చేసిన పనులు వేగంగా మొదలై పూర్తయ్యే అవకాశముంది. కానీ చాలా మంది ఎంపీలు అసలు సిఫారసులు చేయటంలోనే బాగా తాత్సారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
అలాగే కొందరు ఎంపీలు నిర్దేశించిన పనులకు కాకుండా తమిష్టప్రకారం సిఫారసులు చేస్తుంటారు. నిబంధనలకు వ్యతిరేకంగా వచ్చే సిఫారసులను కలెక్టర్లు ఆమోదించరు కాబట్టి ఆ సిఫారసులన్నీ పెండింగ్ లోనే ఉంటాయి. అలాగే ఏడాదిపాటు పెండింగ్ లో ఉన్న తర్వాత సదరు ఫండ్స్ మొత్తం మురిగిపోతున్నాయి. అంటే ఫండ్స్ ను ఉపయోగించుకోవటంలో ఎంపీలకు సరైన అవగాహన లేకపోవటమో లేకపోతే తమిష్ట ప్రకారమే నిధులను ఉపయోగించుకోవాలన్న పట్టుదల వల్లో సమస్యలు వస్తున్నాయి.
నిజానికి ఎంపీ ల్యాడ్ ఫండ్స్ సౌకర్యాన్ని బాగా ఉపయోగించుకునే ఎంపీల సంఖ్య చాలా తక్కువని గతంలో కేంద్రప్రభుత్వమే చాలా సార్లు చెప్పింది. ఖాతాలో డబ్బులున్నా సరైన సిఫారసులు చేయలేక పోవటం ఎంపీల చేతకానితనం తప్ప మరోటికాదు. ఈ ఫండ్స్ వినియోగాన్ని మానిటర్ చేయటానికి నియమ, నిబంధలను కచ్చితంగా అమల్లయేలా చూడటానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులుంటారు. వాళ్ళతో మాట్లాడితే సరైన ఫార్మాట్ ఏమిటో చెబుతారు. కానీ చాలామంది ఎంపీలు ఆ పని చేయకపోవటం వల్లే సమస్యలు వస్తున్నాయి. ఈ పథకం క్రింద ఐదేళ్ళకు కేంద్రం రు. 17,417 కోట్లు ఖర్చు చేయబోతోంది. మరింతటి సౌకర్యాన్ని ఎంతమంది ఎంపీలు ఉపయోగించుకుంటున్నారన్నదే సమస్య.