Begin typing your search above and press return to search.

ఫ్లైట్ టిక్కెట్ల మీద ఎయిర్ పోర్ట్ పేరు మారనుంది

By:  Tupaki Desk   |   3 March 2016 12:58 PM IST
ఫ్లైట్ టిక్కెట్ల మీద ఎయిర్ పోర్ట్ పేరు మారనుంది
X
మోడీ సర్కారు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై ఏదైనా ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేస్తే.. టిక్కెట్టు మీద బుక్ చేసిన ఎయిర్ పోర్ట్ పేరు అసలు పేరుతో వచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అన్న వెంటనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అనే పేరుంది. అదే విధంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అన్న వెంటనే ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ అన్న పేరిట ఉంది.

కానీ.. తాజాగా కేంద్రవిమానయాన శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ప్రముఖుల పేరు మీద పెట్టిన ఎయిర్ పోర్ట్ పేర్లను ఇకపై ఫ్లైట్ టిక్కెట్ల మీద ప్రింట్ చేయరు. ఏ నగరానికి ఆ నగరం పేరు మీదనే ఎయిర్ పోర్ట్ లను వ్యవహరిస్తుంటారు. వివిధ రాజకీయ నాయకుల పేర్లతో ఎయిర్ పోర్ట్ లను వ్యవహరించటం వల్ల.. ఆయా నగరాల పేర్లు అర్థం కావటం లేదని.. ఇది కన్ఫ్యూజింగ్ గా ఉందన్న అభిప్రాయంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

మరి.. ప్రముఖుల పేర్లు పెట్టుకొని.. తమ గొప్పతనాన్ని కీర్తించుకునేందుకు అలవాటు పడిన పార్టీలు తాజాగా తీసుకున్న నిర్ణయానికి ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరి.. విమానయాన శాఖ తీసుకున్న తాజా నిర్ణయంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. దేశంలోని చాలా ఎయిర్ పోర్ట్ లకు గాంధీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు.