Begin typing your search above and press return to search.

బీజేపీ సీనియ‌ర్ మాట: మోడీ మ‌ళ్లీ సీఎం కూడా కాలేరు

By:  Tupaki Desk   |   26 Dec 2018 6:16 AM GMT
బీజేపీ సీనియ‌ర్ మాట: మోడీ మ‌ళ్లీ సీఎం కూడా కాలేరు
X
బీజేపీ నేత‌ల చూపంతా ఇప్పుడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పీఠంపై ప‌డింది. నరేంద్రమోడీ తిరిగి ప్రధాని కాబోరని బీజేపీ సీనియర్‌ నేత - కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్నసిన్హా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు అంతా ఏకవ్యక్తి ప్రదర్శన(ఒన్‌ మ్యాన్‌ షో)గా - ఇద్దరు వ్యక్తుల సైన్యంగా తయారైందంటూ మోడీ-అమిత్‌ షాలనుద్దేశించి సిన్హా వ్యాఖ్యానించారు. మోడీ అహంకారానికీ - అత్యధిక అహంకారానికీ నిదర్శనమని సిన్హా విమర్శించారు. దేశానికి వెన్నెముకలాంటి రైతుల్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌ డీఏ ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని - అందువల్లే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందని సిన్హా అన్నారు. మోడీకీ - బీజేపీకీ ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని - వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని శత్రుఘ్నసిన్హా స్పష్టం చేశారు.

ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ వ్యవస్థాపకుడు రామ్‌ నాథ్‌ గోయెంకా - నానాజీ దేశ్‌ ముఖ్‌ - లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ తనను వాజ్‌ పేయి - అద్వానీలకు పరిచయం చేయడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చానని సిన్హా తెలిపారు. ఎవరినీ సంప్రదించకుండా నోట్లరద్దు - జీఎస్టీ వంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగిందని సిన్హా అన్నారు. ఆర్థికమంత్రి జైట్లీ ఇప్పటికే జీఎస్టీకి 360 సవరణలు చేశారని సిన్హా గుర్తు చేశారు. ఒక న్యాయవాది ఆర్థికవేత్తగా - టీవీ నటి మానవ వనరులశాఖమంత్రిగా మారారంటూ అరుణ్‌ జైట్లీ - స్మృతి ఇరానీలనుద్దేశించి సిన్హా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ ఎస్‌ ఎస్‌ కన్నా నరేంద్రమోడీ పైచేయి సాధించారని సిన్హా అన్నారు. తనను గత లోక్‌ సభ ఎన్నికల్లో పాట్నా స్థానం నుంచి మార్చాలని మోడీ యత్నించారని సిన్హా విమర్శించారు. తాను 2014 లోక్‌ సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారీటీతో గెలిచానని సిన్హా తెలిపారు. వాజ్‌పేయి హయాంలో బీజేపీ ఎంతో ప్రజాస్వామ్యయుతంగా ఉండేదని, మోడీ-అమిత్‌ షాలే దానిని కనుమరుగు చేశారని సిన్హా దుయ్యబట్టారు. ఎల్‌ కె అద్వానీ - మురళీమనోహర్‌ జోషి - అరుణ్‌ శౌరీ - యశ్వంత్‌ సిన్హా లాంటి వారిని మోడీ పక్కన పెట్టారని సిన్హా అన్నారు.