Begin typing your search above and press return to search.
దిగిపోయే ముందు మోడీ బ్రహ్మాస్త్రం
By: Tupaki Desk | 14 May 2019 8:18 AM GMTఇంకో విడత ముగిస్తే దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తిగా ముగిసిపోతుంది. మే 23న దేశంలో అధికారంలోకి వచ్చేది ఎవరో తెలిసిపోతుంది. ఈ చివరి విడతలో మోడీ భారీ తాయిలం ప్రకటించారు. కానీ ఇదేదో ముందే ప్రకటిస్తే నాలుగు ఓట్లు అయినా దక్కేవి. నిండా మునిగాక ఇప్పుడు ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది.
చిన్న పారిశ్రామికవేత్తలకు మోడీ తీపికబురునందించాడు. మోడీ ప్రభుత్వం తాజాగా యూనివర్సల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చిన్న రుణదారులకు సాయం చేయడమే ఈ పథకం లక్ష్యం. దీనిద్వారా చిన్న రైతులు - కళాకారులు - చిన్నపారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అయితే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తేనే మోడీ ఈ పథకం అమలు చేసే అవకాశాలున్నాయి.
సంవత్సర ఆదాయం రూ60వేల కంటే తక్కువ ఉన్నవారికి ఈ పథకం వర్తింప చేస్తారట.. రూ.35వేల కంటే తక్కువ రుణాలు, ఆస్తుల విలువ రూ.20వేల అంతకంటే తక్కువ ఉన్న వారే ఈ పథకానికి అర్హులట.. ఈ పథకానికి రూ.20వేల కోట్లను కేంద్రం కేటాయిస్తోంది.అయితే అర్హత నిబంధనలతో దేశంలో చాలా మందికి అక్కరకు రాకుండా పథకాన్ని మోడీ తయారు చేశారన్న విమర్శ వ్యక్తమవుతోంది. రూ.35వేల కంటే తక్కువ రుణం అందరూ ఈజీగా తేల్చేయగలరు. కనీసం లక్షవరకూ ఉంటేనే ఎవరికైనా లబ్ధి.
చిన్న మొత్తంలో తీసుకున్న వారు రుణం తిరిగి చెల్లించలేని వారిని రుణాలనుంచి విముక్తి కలిగించేందుకు ఈ పథకమట.. అయితే రుణాలు మాఫీ కావాలంటే అంతకుముందు ఏదీ బ్యాంకులకు ఇతర సంస్థలకు ఎగ్గొట్టకుండా ఉండాలట.. ఇలా సర్వ ఆంక్షలు పెట్టి పథకాన్ని చివర్లో ప్రకటించిన మోడీ ఎత్తు ఫలిస్తుందో లేదో చూడాలి.