Begin typing your search above and press return to search.

మోడీ ఆస్తి: పావు ఇల్లు, 4700 న‌గ‌దు

By:  Tupaki Desk   |   2 Feb 2016 3:50 AM GMT
మోడీ ఆస్తి: పావు ఇల్లు, 4700 న‌గ‌దు
X
కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న వ్యక్తి ఆస్తి లక్షల్లో ఉండే రోజులివి. ఇక.. ఎమ్మెల్యేల ఆస్తుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి.. దేశాన్ని ఏలే ప్రధాని మోడీ ఆస్తి ఎంత ఉంటుంది? ఆయన చేతిలో క్యాష్ ఎంత ఉండి ఉంటుంది? బంగారం.. వెండి లాంటి ఆభరణాలు ఏమైనా ఉన్నాయా? ఆయన బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెంటనే దొరకవు. ఇప్పుడా ఇబ్బంది లేదు. ఆయన తన ఆస్తుల వివరాల్ని తాజాగా ప్రకటించారు.

ఈ జనవరి 30న విడుదల చేసిన మోడీ ఆస్తుల లెక్క చూస్తే.. మొత్తం రూ.1,41,14,893గా తేలింది. గత ఏడాది మోడీ ఆస్తులు రూ.1,26,12,288గా కావటం గమనార్హం. మోడీ పేరు మీద ఒక్క వాహనం కూడా లేదు. ఆయన బ్యాంకు ఖాతాను గుజరాత్ లోనే కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో ఆయనకు అకౌంట్ లేదు. ఇక.. ప్రధాని ఆస్తుల లెక్కల్లోకి వెళితే.. 2002లో గాంధీనగర్ లో కొన్న రెసిడెన్షియల్ ప్లాటులో నాలుగోవంతు భాగం ఉంది. ఆయన కొన్న ఇంటి విలువ దాదాపు 25 రెట్లు పెరగటంతో ఆయన ఆస్తుల్లో వృద్ధి రేటు భారీగా పెరిగినట్లు కనిపించే పరిస్థితి.

ఇక.. మోడీ దగ్గర నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ.1,19,000. 45 గ్రాముల బరువు ఉన్న బంగారం తప్పించి ఆయన దగ్గర మరెటువంటి ఆభరణాలు లేవు. ఇక.. అప్పులు కూడా లేవు. రూ.20వేలు విలువ చేసే ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్లు.. రూ.5.45 లక్షలు విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు.. రూ.1.99లక్షల విలువైన బీమా పాలసీతో కలిసి చరాస్తుల విలువ మొత్తం రూ.41.45 లక్షలుగా తేల్చారు. మొత్తం ఆస్తుల్లో గాంధీనగర్ ఇంటి విలువను మినహాయిస్తే.. మోడీ ఆస్తులు పెద్దగా ఉన్నట్లు కనిపించవు.