Begin typing your search above and press return to search.
జగన్ మూడు రాజధానుల కల నెరవేరకూడదని మోడీషాలు డిసైడ్ చేశారా
By: Tupaki Desk | 22 Nov 2021 5:05 AM GMTఏ ప్రశ్న అడిగినా ఇట్టే సమాధానం చెప్పే వారికి.. ఏపీ రాజధాని? ఎదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి. సామాన్యుడే కాదు రాజకీయాల్లో తల పండిన వారు కూడా ఏం జరుగుతుందన్న దానిపై పలు సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి అవకాశం లేదనే చెప్పాలి.
ఎందుకంటే.. ఏపీ రాజధాని మీద ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్నిచూస్తే ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు. అంతేకాదు.. తాజాగా ఏపీ బీజేపీ రథసారధి చేసిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడురాజధానుల కల కంచికి వెళ్లినట్లేనన్న భావన కలుగక మానదు.
ఏపీ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేయటం చాలా పాత వార్త.
ఎన్నికల అనంతరం చారిత్రక విజయంతో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జగన్ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఒకటి ఏపీ రాజధానిగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావించటం. అందుకు తగ్గట్లు చాలానే కసరత్తు చేశారు.
జగన్ మూడు రాజధానుల కలను అమరావతి రైతులతో పాటు.. పలువురు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా.. సుదీర్ఘంగా ఉద్యమం సాగిందంటే అది అమరావతిని రాజధానిని కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ.. అమరావతి పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటమనే చెప్పాలి.
ప్రస్తుతం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అన్న నినాదంతో మొదలైన మహాపాదయాత్ర 23వ రోజు సాగుతోంది. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నా.. వెనక్కి తగ్గకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ మహాపాదయాత్ర సాగుతోంది. ఇదంతాఒక ఎత్తు అయితే.. మహాపాదయాత్ర మొదలైన తర్వాత బీజేపీ అధినాయకత్వం మాటల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
ఇటీవల కేంద్ర హోంమంత్రి కమ్ బీజేపీ అధినాయకుడు మోడీకి నీడలా వ్యవహరించే అమిత్ షా.. మహాపాదయాత్రలో ఏపీ నేతలు ఎందుకు పాల్గొనటం లేదన్న ప్రశ్నతో పాటు.. అమరావతికి తాము సానుకూలంగా ఉన్నామన్న విషయాన్ని చెప్పేశారు.
మహాపాదయాత్రలో పాలుపంచుకోకపోవటాన్ని తప్పు పడుతూ.. ఏపీ బీజేపీ నేతలకు తలంటారు. అమిత్ షా క్లాస్ పీకిన తర్వాతి రోజే.. మహాపాదయాత్రలో పాల్గొంటామన్న ప్రకటనను ఏపీ బీజేపీ నేతల నోటి నుంచి వచ్చింది. అంతేకాదు.. ఏపీ రాజధానిగా అమరావతినే ఉంటుందన్న సంకేతాల్ని తాజాగా మరింత బలంగా ఇచ్చింది బీజేపీ. ఇందుకు సోము వీర్రాజు చేసిన ప్రకటనగా చెప్పాలి.
ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని తాము అమరావతిలోనే నిర్మిస్తున్నామని చెప్పారు. అమరావతి ఒక్కటే రాజధాని అంటూ పాదయాత్ర చేస్తున్న రైతులకు తమ మద్దతు ఉంటుందని చెప్పటమేకాదు.. పార్టీ రాష్ట్ర ఆఫీసును అమరావతిలోనే చేపట్టటం చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కల నెరవేరదన్న మాటకు బలం చేకూరుతోంది.
ఇంతకూ ఏపీ బీజేపీకి మహాపాదయాత్ర మీద అంత మనసు కావటానికి కారణం ఏమిటి? వారెందుకు అమరావతి విషయంలో ఇప్పుడే స్పష్టత ఎందుకు ఇస్తున్నట్లు? అన్న సందేహాలకు కొత్త సమాధానం వినిపిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుండటం.. దీని కారణంగా జరిగే డ్యామేజ్ ను భర్తీ చేసేందుకు వీలుగా.. తమకు ఎలాంటి ఇబ్బంది లేని అమరావతిని ఏపీ రాజధాని అన్న వాదనకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
విశాఖ ఉక్కుతో కలిగే మైనస్ కు.. ఏపీలో మూడు రాజధానులకు బదులుగా అమరావతి ఒక్క రాజధానిగా చేయటం ద్వారా నష్టనివారణకు వీలుంటుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నెలల తరబడి చేస్తున్న అమరావతి రైతుల పోరాటం ఫలించే రోజు దగ్గర్లోనే ఉందన్న మాట వినిపిస్తోంది.