Begin typing your search above and press return to search.

రద్దు నిర్ణయంపై ఆ దేశ ప్రధాని పొగిడేశారు

By:  Tupaki Desk   |   17 Nov 2016 4:01 AM GMT
రద్దు నిర్ణయంపై ఆ దేశ ప్రధాని పొగిడేశారు
X
నోట్ల రద్దు నిర్ణయం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన యాభై ఏళ్లలో ఏ ఒక్క నిర్ణయం కూడా ఇంత వేగంగా.. దేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది లేదనే చెప్పాలి. ఒక ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల్ని గంట వ్యవధిలో ప్రభావితం చేయటం.. సమాచారం పూర్తిగా చేరిపోవటం అన్నది ఇదే తొలిసారిగా చెప్పాలి.

నల్ల కుబేరులకు చెక్ పెడుతూ.. బ్లాక్ మనీరాయుళ్లకు వణుకు పుట్టించటంతో పాటు.. పన్ను ఎగవేతకు ద్వారాల్ని మూసివేసేలా నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీపై రాజకీయ పక్షాలు.. కొన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విమర్శించటం తెలిసిందే. సొంతింట్లో మోడీ నిర్ణయంపై ఇలాంటి పరిస్థితి ఉంటే.. పొరుగున ఉన్న దేశాధినేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారన్నది చూస్తే ఆసక్తికరంగా అనిపించక మానదు.

తాజాగా మారిషస్ ప్రధాని అనిరుద్ జగన్నాథ్ ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై స్పందించారు.మోడీ నిర్ణయం సరైనదే అన్న ఆయన.. ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా దీర్ఘకాలంలో దేశానికి.. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఫలితాలు చూశాక ఇదెంత మంచి నిర్ణయమన్నది ప్రజలు గ్రహిస్తారని వ్యాఖ్యానించటం గమనార్హం.

భారత్ తో తమకు రక్త సంబంధం ఉందని వ్యాఖ్యానించిన ఆయన.. ఇరుగుపొరుగు దేశాలతో తమకుమంచి సంబంధాలు ఉన్నట్లుగా వెల్లడించారు. భారత్ తమకు ఎంతో కాలంగా సహాయ సహకారాలు అందిస్తున్న వైనాన్ని గుర్తు చేసిన ఆయన.. మోడీ నిర్ణయాన్ని ప్రశంసలతో ముంచెత్తటం గమనార్హం. సొంతిట్లో ఏమో మోడీని తిట్టిపోస్తుంటే.. పొరుగున ఉన్నోళ్లు మాత్రం పొగిడేస్తున్నారు. రాజకీయ నేతల సంగతి తర్వాత మీడియా సైతం ఇలాంటి ధోరణే కనిపిస్తోంది. మోడీ రద్దు నిర్ణయంపై కొన్ని మీడియా సంస్థలు.. సంచలన వార్తలంటూ హడావుడి చేస్తుంటే.. అంతర్జాతీయ మీడియా మాత్రం ప్రత్యేక కథనాలు అచ్చేసి మరీ.. మోడీ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నాయన్న విషయాన్ని మర్చిపోలేం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/