Begin typing your search above and press return to search.

అఖిలేష్ ఇంటి స‌మ‌స్య తీర్చిన మోడీ..!

By:  Tupaki Desk   |   22 Dec 2016 11:30 PM GMT
అఖిలేష్ ఇంటి స‌మ‌స్య తీర్చిన మోడీ..!
X
ఎక్క‌డో స్విచ్ వేస్తే... ఇంకెక్క‌డో బ‌ల్బ్ వెలుగుతుంద‌ని అంటారు. అలానే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్విచ్ వేస్తే... ఎక్క‌డో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో బ‌ల్బు వెలిగింది! అఖిలేష్ కు ఇప్పుడు కొత్త వెలుగు క‌నిపిస్తోంది. మోడీ ద‌య‌వ‌ల్ల ఆయ‌న పెద్ద స‌మ‌స్య నుంచీ బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెప్పాలి. నిజానికి - ప్ర‌త్య‌క్షంగా అఖిలేష్ కు మోడీ చేసిన ఉప‌కార‌మేమీ లేదుగానీ, ప‌రోక్షంగా ప‌రిస్థితి అలా క‌లిసి వ‌చ్చేసింది.

ఈ మ‌ధ్య ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు అన‌గానే... ములాయం ఇంటి త‌గాదాలే గుర్తొచ్చేవి. అఖిలేష్ ఫ్యామిలీలో మొద‌లైన మ‌న‌స్ఫ‌ర్థ‌లు - అంత‌ర్గ‌త క‌ల‌హాలూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి పెద్ద మైన‌స్ కాబోతున్నాయ‌ని అని విశ్లేష‌కులు భావించారు. ఇంటి గొడ‌వ‌ల‌పై యూపీ ప్ర‌జ‌లు కూడా నారాజ్ అయ్యారు. ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌డం మానేసి, ముఖ్య‌మంత్రి అండ్ కో త‌గాదాలు ప‌డుతున్నార‌ని అనుకున్నారు. ఈ ద‌శ‌లో అఖిలేష్ కూడా కాస్త నీర‌సించారు. ఎన్నిక‌ల ముందు త‌న ఫ్యామిలీ మీద ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతున్న నెగెటివ్ ఫీలింగ్ ని ఎలా తొల‌గించాలో అని అఖిలేష్ కూడా త‌ల‌లు ప‌ట్టుకున్న సంద‌ర్భాలున్నాయ‌ని అంటారు.

ఈ స‌మ‌స్య‌ల‌న్నింటినీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఒకే ఒక్క నిర్ణ‌యంతో ప‌క్క‌కి నెట్టేశారు. ఆ నిర్ణ‌య‌మే... పెద్ద నోట్ల ర‌ద్దు. నోట్ల ర‌ద్దు త‌రువాత జ‌నాల‌కు క‌రెన్సీ క‌ష్టాలు ఎక్క‌వైపోయాయి. మొద‌ట్లో మోడీ మీద ఉన్న న‌మ్మ‌కంతో... ‘కొద్ది రోజులు బ్యాంకుల ముందు నిల‌బ‌డితే త‌ప్పేంటీ’ అనుకున్న‌వారు కూడా... అవ‌స్థ‌లు ఎప్ప‌టికీ త‌గ్గ‌క‌పోవ‌డంతో భాజ‌పా స‌ర్కారుపై దుమ్మెత్తి పోయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో రాష్ట్ర రాజ‌కీయాల గురించి ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఇదే ప‌రిస్థితి యూపీలో అఖిలేష్ కు ప్ల‌స్ అయింది.

ప్ర‌జలంద‌రూ నోట్ల క‌ష్టాల గురించే మాట్లాడుకుంటూ, అఖిలేష్ ఫ్యామిలీ గొడ‌వ‌ల్ని ప‌ట్టించుకోవ‌డం తగ్గిపోయింది. పైగా, మీడియా దృష్టి కూడా న‌గ‌దు స‌మ‌స్య‌ల‌పైకే వెళ్ల‌డంతో అఖిలేష్ ఊపిరి పీల్చుకుంటున్నారు. అదే విష‌యాన్ని ఇప్పుడు ఓపెన్ గా చెబుతున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం రాజ‌కీయంగా త‌న‌కు క‌లిసి వ‌చ్చింద‌ని అఖిలేష్ వ్యాఖ్యానిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత దూకుడుతో ముందుకు సాగుతాం అంటున్నారు. ఆ ర‌కంగా మోడీ నిర్ణ‌యం ఎస్పీకి అందివ‌చ్చిన అస్త్రంగా మారుతోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న రాష్ట్రాల ఎన్నిక‌ల్లో పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌య‌మే ప్ర‌ధాన అజెండా ఉంటుందన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. స్థానిక అంశాలూ, ఇత‌ర రాజ‌కీయాల‌కూ పెద్ద‌గా ప్రాధాన్య‌త ఉండ‌క‌పోవ‌చ్చు. సో... ఓవ‌రాల్ గా అఖిలేష్ కు మోడీ సాబ్ చాలా మేలు చేసిన‌ట్టే క‌దా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/