Begin typing your search above and press return to search.
మోడీ హగ్ ఈసారి ఎవరికంటే..?
By: Tupaki Desk | 10 July 2018 5:13 AM GMTమోడీ ముందు ప్రధానులుగా వ్యవహరించిన నేతలు ఉన్నప్పటికీ.. వారిలో లేని ఒక గుణం నమో సొంతమని చెప్పాలి. విదేశీ అతిధుల్ని కలిసినప్పుడు ఆయన తీరు గత నేతల కంటే భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఆత్మీయంగా పలుకరించే విషయంలో మోడీ అనుసరించే విధానం అందరిని ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. తమకు అత్యంత సన్నిహితుడన్న భావాన్ని తన చేతల్లో చేసి చూపించటం మోడీకున్న అలవాటుగా చెప్పక తప్పదు.
దేశాధ్యక్షుల్ని కలిసే క్రమంలో వారికి తనదైన ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం మోడీకి ఒక అలవాటు. తాజాగా తన హగ్ ను మరో దేశాధ్యక్షుడికి పరిచయం చేశారు మోడీ. దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు మూన్ జే ఢిల్లీకి రావటం.. ఒక కార్యక్రమంలో హాజరైన ఆయనకు మోడీ తన ఆత్మీయ హగ్ ను పరిచయం చేశారు.
ఢిల్లీ శివారులో ఏర్పాటు చేసిన అతి పెద్దదైన మొబైల్ ఫోన్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ కర్మాగారం మరెవరిదో కాదు.. స్మార్ట్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో దిగ్గజ సంస్థ అయినా శాంసంగ్ సంస్థ నొయిడా శివారులో స్మార్ట్ ఫోన్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు.
దాదాపు రూ.5వేల కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ కర్మాగారంతో.. ప్రపంచంలోనే అతి పెద్దదైన స్మార్ట్ ఫోన్ల తయారీని ఇక్కడ చేపడతారు. ఈ ఫ్యాక్టరీ ప్రత్యేకత ఏమంటే.. ఇక్కడ నుంచి ఏడాదికి రూ.12 కోట్ల స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తారు. అంతేనా.. దాదాపు 30 శాతం ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేస్తారు కూడా. నాలుగేళ్ల క్రితం దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు రెండే రెండు ఉండేవని.. ప్రస్తుతం అది కాస్తా 120కు చేరుకున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్ల తయారీ కర్మాగారాలు పెరగటం కారణంగా దేశంలో నాలుగు లక్షల మంది ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టి జరిగినట్లుగా మోడీ వెల్లడించారు.