Begin typing your search above and press return to search.

మోడీ ఇంపాక్ట్‌ అంబానీలపై రివర్స్‌లో ఉందే !!

By:  Tupaki Desk   |   26 May 2015 8:56 AM GMT
మోడీ ఇంపాక్ట్‌ అంబానీలపై రివర్స్‌లో ఉందే !!
X
మోడీ ఏడాది పాలన ముగిసింది. ఎన్నో ఆశలతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు.. దేశ ప్రజలకు ఏం చేసిందన్న దాని కంటే.. పారిశ్రామిక వర్గాలకు చాలా చేశారన్న విమర్శ భారీగా వినిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా సరే.. అంబానీల హవా మాత్రం నడుస్తూనే ఉంటుందన్న మాట వినిపిస్తుంటుంది. అయితే.. ఆ మాటలో నిజం లేదేమోనని తాజా గణాంకాలు చూస్తే అనుమానం వస్తోంది.

మోడీ అధికారంలోకి రావటం కారణంగా అంబానీలు భారీగా నష్టపోతే.. టాటా, అదానీలు మాత్రం బాగా లాభపడ్డారన్న మాట వినిపిస్తోంది. అంబానీలతో పాటు.. ఎల్‌అండ్‌టీ.. ఐటీసీ లాంటి పలు సంస్థలు తమ మార్కెట్‌ క్యాప్‌ కోల్పోయాయి.

అదే సమయంలో టాటా.. అదానీ..భారతీ ఎయిర్‌టెల్‌.. హెచ్‌డీఎఫ్సీ.. సన్‌ గ్రూప్‌లు లాంటివి మాత్రం లాభ పడ్డాయని చెబుతున్నారు. మోడీ ప్రధానమంత్రి కాక ముందు.. అయిన తర్వాత అంబానీల్లో పెద్దవాడైన ముఖేశ్‌ అంబానీ మార్కెట్‌ విలువ ఏడాది కాలంలో రూ.80 వేల కోట్ల మేర క్షీణించటం గమనార్హం. అదే సమయంలో.. అంబానీల్లో చిన్నవాడైన అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ సంస్థల విలువ రూ.50 వేల కోట్ల మేర పడిపోయిందని చెబుతున్నారు.

అదే విధంగా వేదాంత.. ఐటీసీ గ్రూఫులు రూ.20 వేల కోట్లు నష్టపోతే.. మోడీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ మాత్రం రూ.50 వేల కోట్లకు పెరిగింది.

ఇక.. టాటాల మార్కెట్‌ విలువ రూ.1.10 లక్షల కోట్లకు పెరగటం విశేషం. హెచ్‌డీఎఫ్సీ.. సన్‌గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ విలువ సైతం రూ.లక్ష కోట్లకు పైగా విలువ పెరగటం గమనార్హం. మొత్తానికి మోడీకి.. అంబానీలకు మధ్య అంత సత్‌సంబంధాలు లేవన్న దానికి.. ఈ గణాంకాలే నిదర్శనమంటున్నారు.