Begin typing your search above and press return to search.

మోడీ - కేసీఆర్‌ కు ఆ విష‌యంలోనే పోటీ

By:  Tupaki Desk   |   24 May 2018 5:45 AM GMT
మోడీ - కేసీఆర్‌ కు ఆ విష‌యంలోనే పోటీ
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీపడుతున్నారు. మీరు అనుకుంటున్న‌ట్లు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ రాజ‌కీయంతో ఢిల్లీ పీఠంపై క‌న్నేసే విష‌యంలో కాదు...ప్ర‌జ‌ల‌పై ధ‌ర‌ల భారం మోప‌డంలో. ఔను...ప్ర‌ధాని మోడీతో పోటీ అన్న‌ట్లుగా కేసీఆర్ కూడా ధ‌ర‌లు పెంచేస్తూ పోతున్నారు. ప్ర‌ధాని మోడీ పెట్రో ధ‌ర‌లు పెంచుతూ పోతుంటే...తెలంగాణ సీఎం కేసీఆర్ బీర్ల ధ‌ర‌లు పెంచేశారు. ఏకంగా 10% భారం మోపారు. హాట్ స‌మ్మ‌ర్‌ లో కూల్ బీర్‌ పై పెంచిన ఈ ధ‌ర‌ల‌తో స‌ర్కారుకు భారీగానే ఆదాయం వ‌స్తుంద‌ని చెప్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో పెట్రోల్ ధ‌ర‌లు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని ప్ర‌ధాన నగరాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.80ని దాటేసింది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో అయితే రూ.85కు చేరింది. స‌హ‌జంగా ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉన్న‌పుడు పాల‌కులు ఎవ‌రైనా ధ‌ర‌లు పెంచ‌డంపై దృష్టి సారించ‌రు. కానీ మోడీజీ భిన్న‌మైన రాజ‌కీయ‌వేత్త అనే పేరుండ‌ట‌మో లేదా మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు కానీ చార్జీల భారం మోపుతున్నారు. పెట్రో ధ‌ర పెర‌గ‌ని రోజంటూ లేద‌న‌డం అతిశ‌యోక్తేం కాదు. అయితే దేశ ప్ర‌ధాని తీరు ఇలా ఉంటే...తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీరు ధ‌ర‌ల‌ను రూ.10 మేర పెంచుతూ అధికారులు పెట్టిన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆయ‌న ఓకే చెప్పేశారు.

తాజా లెక్క‌ల ప్ర‌కారం బీర్ల‌పై రూ.10 పెంపుద‌ల వ‌ల్ల ఖ‌జానాకు పెద్ద ఎత్తునే డ‌బ్బులు చేరుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏడాదికి రూ.300 కోట్లు ఖ‌జ‌నాకు రాబ‌డి రూపంలో రానున్నాయ‌ని భావిస్తున్నారు. దేశంలోనే బీరును ఎక్కువ‌గా తాగే రాష్ర్టాల‌లో తెలంగాణ ఒక‌టి. న్యూఢిల్లీ - కేర‌ళ‌ - క‌ర్ణాట‌క‌ల త‌ర్వాతి స్థానం తెలంగాణ‌దే. ఈ పెంపుపై అధికారులు స్పందిస్తూ ప్ర‌త్యేకంగా ధ‌ర‌లు పెంచ‌లేద‌ని తెలిపారు. ప్ర‌తి రెండేళ్లకోసారి ధ‌ర‌ల పెంపుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అదే రీతిలో ఈ ఏడాది సైతం పెంచార‌ని తెలియ‌జేశారు.