Begin typing your search above and press return to search.

మెట్రోలో మోదీ.. విద్యార్థులతో ముచ్చట్లు..!

By:  Tupaki Desk   |   11 Dec 2022 8:30 AM GMT
మెట్రోలో మోదీ.. విద్యార్థులతో ముచ్చట్లు..!
X
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్యుడిలా స్టేషన్లో టికెట్ కొనుగోలు చేసి తోటి ప్రయాణికులతో కలిసి కొంత దూరం ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులు.. తోటి ప్రయాణికులతో మోదీ ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైల్వేలో అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల కోసం కొత్త కొత్త రైళ్లను తీసుకోస్తుంది. ఇప్పటికే ఐదు వందేమాతరం రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాజాగా ఆరో వందేమాతరం రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ రైలు మహారాష్ట్రలోని నాగ్ పూర్.. చత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ మధ్య సేవలు అందించనుంది. ఈ వందేమాతరం రైలును మోదీ ఆదివారం నాగపూర్లో జెండా ఊపి ప్రారంభించారు. సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి ఫ్రీడమ్ పార్క్.. ఖప్రీ స్టేషన్ మద్య మెట్రోలో పయనించారు. ఈ సందర్భంగా రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థులు.. ఇతర ప్రయాణికులతో మోదీ ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నాగపూర్లో రూ. 8వేల 650 కోట్లతో నిర్మించిన మెట్రో ఫేస్ ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం రూ.6వేల 700 కోట్ల విలువ చేయనున్న మెట్రో ఫేస్ 2 పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నాగపూర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం.. రూ.950 కోట్లతో నాగపూర్.. అజని రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ వన్ హెల్త్ కు శంకు స్థాపన తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

అనంతరం అక్కడి నుంచి గోవా బయలుదేరి వెళ్లి అక్కడ నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. కాగా నాగపూర్ కు వచ్చిన ప్రధాని మోదీకి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే.. డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవీస్.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. తదితరులు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.