Begin typing your search above and press return to search.

ఇవాంక‌కు మోడీ ఆఫ‌ర్‌..ఆమె రియాక్ష‌న్...

By:  Tupaki Desk   |   27 Jun 2017 6:55 AM GMT
ఇవాంక‌కు మోడీ ఆఫ‌ర్‌..ఆమె రియాక్ష‌న్...
X
అమెరికా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని వెళ్లిపోయారు ప్ర‌ధాని మోడీ. తాను ఉన్న రెండు రోజుల వ్య‌వ‌ధిలో అమెరికాపై త‌న ముద్ర‌ను వేయ‌టంలో మోడీ విజ‌యం సాధించార‌నే చెప్పాలి. మోడీని ట్రంప్ పొగిడిన తీరు.. ఆయ‌న చేసిన కీల‌క వ్యాఖ్య ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఇక ఎప్ప‌టికీ అమెరికా.. భార‌త్ మ‌ధ్య సంబంధాలు ఇంత అద్భుతంగా ఉంటాయ‌న్న రీతిలో ట్రంప్ చెప్ప‌టం చూస్తేనే.. మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న ఎంత స‌క్సెస్ ఫుల్ గా సాగిందో అర్థ‌మ‌వుతుంది.

ట్రంప్‌ను ఇండియాకు ర‌మ్మ‌న్న న‌రేంద్ర మోడీ.. అంత‌కు ముందే ట్రంప్ కుమార్తె కు భార‌త్‌ కు రావాల్సిందిగా కోరారు. కొద్ది నెల‌ల్లో భార‌త్ లో జ‌రిగే గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ స‌ద‌స్సుకు వ‌చ్చే అమెరికా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఇవాంక నేతృత్వం వ‌హించాల‌ని కోరుతూ ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. త‌న ఆహ్వానాన్ని అంగీక‌రిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

మోడీ ఆహ్వానాన్ని ఇవాంక అంగీక‌రించారు. త‌న‌ను ఆహ్వానించ‌టంపై ఆమె ట్విట్ట‌ర్‌ లో థ్యాంక్స్ చెప్పారు. భార‌త్ కు వ‌చ్చే అమెరికా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు నేతృత్వం వ‌హించాల‌న్న మోడీ ఇన్విటేష‌న్‌ కు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. భార‌త్ లో ప‌ర్య‌టించాల‌న్న మోడీ మాట‌ను కూడా ట్రంప్ మ‌న్నించారు. భార‌త్ కు ట్రంప్ త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైట్ హౌస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ట్రంప్ ఇండియా టూర్ మీద మ‌రిన్ని వివ‌రాలు రావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/