Begin typing your search above and press return to search.

మోడీకి.. మ‌మ‌త‌కు మ‌ధ్య‌నున్న తేడా ఇంతేన‌ట‌!

By:  Tupaki Desk   |   22 May 2019 5:05 AM GMT
మోడీకి.. మ‌మ‌త‌కు మ‌ధ్య‌నున్న తేడా ఇంతేన‌ట‌!
X
దేశం మొత్తం మీదా మోడీకి భ‌లేగా స‌మాధానం చెప్పిన అధినేత ఎవ‌రైనా ఉన్నారంటే ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పేరు వినిపిస్తుంది. అదే స‌మ‌యంలో.. త‌న ప్ర‌త్య‌ర్థిపై సులువుగా పైచేయి సాధించే మోడీ లాంటోడికి సైతం చెమ‌ట‌లు ప‌ట్టించి.. ఉరుకులు ప‌రుగులు పెట్టేలా చేయ‌టంలో దీదీ స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. మంత్రి లేదు ముఖ్య‌మంత్రి లేదు.. ఎక్క‌డికైనా వెళ్లిపోయి త‌నిఖీలు చేసే ఈడీ.. సీబీఐ.. ఐటీ విభాగాలు ప‌శ్చిమ‌బెంగాల్ విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారే త‌ప్పించి.. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి సోదాల హ‌డావుడి చేయ‌లేదు.

ఎందుకంటే.. అది ప‌శ్చిమ‌బెంగాల్ అని.. మిగిలిన రాష్ట్రాల్లో చేసిన‌ట్లుగా చేస్తే.. ఇక్క‌డ చేస్తానంటే సాధ్యం కాదు. అందునా రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌లంగా ఉండ‌టంతో మోడీ పప్పులు పెద్ద‌గా ఉడ‌క‌లేద‌ని చెప్పాలి. అలా అని.. దీదీ ఫాలో అయ్యే విధానం స‌రైన‌దా? అంటే అది కూడా కాద‌నే చెప్పాలి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇద్ద‌రూ దొందూదొందే అంటూ అభివ‌ర్ణించినోళ్లు చాలామందే ఉంటారు.

ఇదిలా ఉంటే.. తాజాగా బెంగాల్ కాంగ్రెస్ నేత మోడీ.. దీదీల‌నుఉద్దేశించి చాలా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒకటి చేశారు. కాంగ్రెస్ గెలుపు మీద ఆయ‌న‌కున్న న‌మ్మ‌కం తాజా వ్యాఖ్య చూస్తే క‌నిపించ‌క‌మాన‌దు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే ప‌శ్చిమ‌బెంగాల్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు సోమెన్ మిత్రా. అవ‌స‌ర‌మైతే దీదీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓప‌క్క ముమ్మ‌రంగా చ‌ర్చ‌లు సాగుతున్న వేళ‌.. ఆయ‌న మాట‌లు దీదీకి గుస్సా అయ్యేలా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కూ ఆయ‌నేమన్నారంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశంలో పెద్ద మార్పే తెస్తాయ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ఎవ‌రేం చేసినా మోడీ మాత్రం మ‌ళ్లీ ప‌వ‌ర్లోకి రావ‌టం సాధ్యం కాద‌ని తేల్చారు. బీజేపీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాకుంటే.. ఆ పార్టీనే ఆయ‌న్ను ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తుందన్నారు. కేంద్రంలో మోడీ పాల‌న‌.. బెంగాల్ లో దీదీ పాల‌న రెండూ ఒకేలా ఉంటాయ‌న్న ఆయ‌న‌.. మోడీ సీనియ‌ర్ మ‌మ‌త అయితే దీదీ జూనియ‌ర్ మోడీ అంటూ ఉన్న మాట‌ను చెప్పేశారు. వీరిద్ద‌రికి తేడా లేద‌న్న ఆయ‌న మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు మ‌నోజ్ తివారీ దీదీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు బెంగాల్ సీఎం మ‌మ‌త‌ను ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌న్నారు. అందుకే ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ కార్య‌క‌ర్త‌ల‌పైన మ‌మ‌త దాడులు చేయించార‌న్నారు ఓటు వేయ‌టానికి ప్ర‌జ‌ల్ని వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకున్నారు. ఆమె ఇప్పుడు మ‌మ‌త దీదీ కాద‌ని.. మ‌మ‌త దాదాగిరి అంటూ మండిప‌డ్డారు.