Begin typing your search above and press return to search.
పాలమూరు నుంచి మోడీ పోటీ.. సడెన్ గా ప్లాన్ ఛేంజ్
By: Tupaki Desk | 7 Jan 2023 12:30 AM GMTగడిచిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ లోని వడోదరతోపాటు వారణాసి ఎంపీ స్థానాల్లో పోటీచేశారు ప్రధాని మోడీ. ఈ రెండూ చోట్ల గెలిచారు. చివరకు వడోదర సీటుకు రాజీనామా చేసి యూపీలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి నుంచి గెలుపొందారు. ఆ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేసిన మోడీ ఈ రాష్ట్రంలో పోటీచేయడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ ను సవాల్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం.
మోడీ ఈసారి తెలంగాణ నుంచి పోటీచేస్తారని.. వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగడానికి సర్వే చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ప్రాథమిక స్థాయి సర్వే పూర్తి చేశారని.. సెకండ్ ఫేజ్ అధ్యయనం త్వరలో మొదలవుతోందని సమాచారం. ఇక ఆల్టర్ నేట్ గా రామనాథపురంపై కూడా మోడీ ఫోకస్ చేశారని.. అమిత్ షా కనుసన్నల్లో సీక్రెట్ స్ట్రాటజీ అని తెలుస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి ప్రశ్నలకు ఢిల్లీ కేంద్ర కార్యాలయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. కేంద్రహోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో రాష్ట్రంలో ఇటీవలే జరిగిన సీక్రెట్ సర్వేలో సానుకూల అబిప్రాయాలు వచ్చాయని.. త్వరలోనే సెకండ్ ఫేజ్ స్టడీ కూడా ఉండనుందని సమాచారం. ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
దక్షిణాదిలో కర్ణాటక మినహా మరెక్కడా అధికారంలో లేని బీజేపీ తెలంగాణలో గెలిచి సౌత్ ఇండియాకు గేట్ వేగా మలుచుకోవాలని ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందుకోసమే మోడీ తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి స్వయంగా పోటీచేయాలని చూస్తున్నారు. తద్వారా దక్షిణ భారత్ లోనూ బీజేపీకి బలం తేవాలని ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీచేసి గెలిచినా ఇప్పుడు బీజేపీలో ఉండడంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఈసారి పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ జిల్లాకు చెందిన డీకే అరుణ ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్నారు. మోడీ చేయడం ఖారరైతే యావత్తు పార్టీ యంత్రాంగం భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమష్టిగా పనిచేస్తుందని అనుకున్నట్టు సమాచారం. మరి మోడీ పోటీచేస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.