Begin typing your search above and press return to search.

మోడీ ఈజ్ గ్రేట్ : పవన్ కవితా నీరాజనం

By:  Tupaki Desk   |   14 Nov 2022 9:03 AM GMT
మోడీ ఈజ్ గ్రేట్ : పవన్ కవితా నీరాజనం
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అరగంటకు పైగా భేటీతో జనసేనాని ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ విషయం విశాఖ లో ఉన్న మూడు రోజుల టూర్ లో ఆయన ఎక్కడా బయటపెట్టలేదు, తానుగా మీడియా ముందు కూడా బయటపడలేదు. యాధాలాపంగా ఆయన తన పని తాను చేసుకున్నారు. విజయనగరం జిల్లా టూర్ ని కూడా ఆయన చేసుకుని వచ్చారు.

ఇక ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాక మోడీ గురించి బాగా ఆలోచించడం మొదలెట్టారు. అంతే ఠక్కున ఆయనకు ప్రముఖ కవి, ఆయన ఎపుడూ తన మాటల ద్వారా ప్రస్థావించే కవి గుంటూరు శేషేంద్ర శర్మ గుర్తుకు వచ్చారు. ఆయన కవితలోని కొన్ని పంక్తులను తీసుకుని దాన్ని దేశ ప్రధాని మోడీతో పోలిక పెడుతూ ట్వీట్ చేశారు. ఇదిపుడు సంచలనం రేపుతోంది.

ఇంతకీ గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పంక్తులు ఏంటి అన్నది మొదట చూస్తే ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద... అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ అని ఉన్నాయి. వీటిని అచ్చంగా స్వచ్చంగా మోడీకే ఆపాదించారు పవన్ కళ్యాణ్. ఆ విధంగా మోడీ మీద తన అభిమానాన్ని ఆయన గట్టిగా మరోసారి చాటుకున్నారు. మోడీ ఈజ్ గ్రేట్ అంటూ తన పోస్టుల నిండా ప్రేమను గుమ్మరించేశారు.

మోడీకి తెలిసినంతగా ఈ దేశంలోని ప్రాంతీయ వాదాలు, సాంస్కృతిక వైరుధ్యాల గురించి ఎవరికీ తెలియదు అని పవన్ అంటున్నారు. మోడీ వాటిని పూర్తిగా అర్ధం చేసుకుని ఈ దేశ పౌరులలో అందరినీ సమానంగా చూస్తూ అంతా భారతీయులే అన్న భావనను నింపారాని పవన్ కొనియాడారు.

అంతే కాదు కరోఅ వంటి అతి భయంకరమైన ప్రకృతి విపత్తు నుంచిఈ దేశాన్ని బయటపడేసిన గొప్ప నాయకుడు అని కీర్తించారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే వేళ దాని నుంచి కూడా దేశాన్ని బయటపడేయడంలో మోడీ అహరహం పరితపించారని గురుత్ చేసుకున్నారు. తాను ప్రధానిగా ఉండగా దేశంలో ఏర్పడిన ప్రతి కఠిన పరిస్థ్తిని మోడీ దృఢ చిత్తంతో ఉక్కు సంకల్పంతో ఎదుర్కొన్నారని కితాబు ఇచ్చారు.

ఈ దేశంలో మోడీ గొప్ప పురోగమశీలిగా పవన్ అభివర్ణించారు. అదే విధంగా మోడీ నాయకత్వ పటిమను, ఆయన స్వభావాన్ని పవన్ ప్రశంసలు కురిపించారు. మొత్తం మీద ఇవన్నీ చూస్తూంటే మోడీ అంటే ఎంత ప్రేమ అభిమానం తన గుండెలలో ఉందో పవన్ గట్టిగా మరోసారి చాటుకున్నారు అని అంటున్నారు. అదే విధంగా విశాఖలో మోడీతో పవన్ భేటీ మీద ఇప్పటిదాకా రకరకాలైన విశ్లేషణలు వచ్చాయి.

అయితే ఈ భేటీ సక్సెస్ ఫుల్ గా సాగిందని పవన్ తాజా పోస్టింగులను బట్టి తెలుస్తోంది అంటున్నారు. అందుకే ఆయన పూర్తి సంతోషంతోనే ఈ రకంగా మోడీ గురించి పాజిటివ్ పోస్టింగులు పెట్టారని అంటున్నారు. మొత్తానికి మోడీ ఈజ్ గ్రేట్. అదే పవన్ చెప్పే సందేశం. ఏపీ రాజకీయాలకు అది సరికొత్త సంకేతం కూడా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.