Begin typing your search above and press return to search.

అందరినీ షేక్ చేసే మోడీ మరో నిర్ణయం?

By:  Tupaki Desk   |   21 July 2020 4:30 PM GMT
అందరినీ షేక్ చేసే మోడీ మరో నిర్ణయం?
X
కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక చేసిన అతిపెద్ద సంస్కరణ ‘బ్యాంకుల విలీనం’. ఇప్పటికే చిన్నా చితకా బ్యాంకులన్నింటిని విలీనం చేసి దేశంలో 12 ప్రభుత్వ రంగ పెద్ద బ్యాంకులను తయారు చేసిన మోడీ మరిన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

అయితే ఈసారి బ్యాంకులను విలీనం చేయకుండా సగానికి పైగా ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. మోడీ ఈ బిగ్ ప్లాన్ అమలైతే దేశంలో కేవలం 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతోందని తెలిసింది.

మొదట మోడీ ప్రభుత్వం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. యూకో బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వంటి వాటిల్లో ప్రభుత్వం తన వాటాలను విక్రయించనున్నట్టు సమాచారం.

దీంతో దేశంలో కేవలం 4 నుంచి 5 మాత్రమే ప్రభుత్వ బ్యాంకులు ఉండాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మోడీ సర్కార్ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం పనిచేస్తోందని తెలియగానే బ్యాంకింగ్ రంగం షేక్ అవుతోంది.